News


జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 5 శాతం డౌన్‌...ఫైనాన్షియల్‌ ఇన్వెస్టర్‌ చేతికే వాటా?

Wednesday 31st July 2019
news_main1564569585.png-27448

జీ ఎంటర్‌టైన్‌మెట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ యజమాన్యం కంపెనీలో కొంతశాతం వాటా విక్రయానికి మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. కంపెనీలో ప్రతిపాదిత వాటా విక్రయానికి రెండు ఆఫర్లు వచ్చాయి. వాటిలో నిర్వహణా వాటా కొనుగోలుకు యూఎస్ కేబుల్‌ దిగ్గజం నుంచి కామ్‌కాస్ట్‌తో పాటు ఫైనాన్షియల్‌ ఫండ్‌ అటైరోస్‌, బ్లాక్‌స్టోన్‌, జేమ్స్‌ మర్దోక్‌కు చెందిన లూపా సిస్టమ్స్‌ కన్సార్షియం నుంచి నాన్‌-బైండింగ్‌ ఆఫర్‌ వచ్చింది. ఈ ఆఫర్‌లో 26 శాతం వాటాను ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలుచేసే ప్రతిపాదన వుంది.  రెండోవది బైండింగ్‌ ఒప్పందంగా పాక్షిక వాటా కొనుగోలుకు ఆఫర్‌ ఒక ఫైనాన్షియల్‌ ఇన్వెస్టరు నుంచి వచ్చింది. కంపెనీకి వచ్చిన రెండు ఆఫర్లపై జీ ప్రమోటింగ్‌ గ్రూప్‌ అయిన ఎస్సెల్‌ గ్రూప్‌ యాజమాన్యం రెండు రోజుల పాటు లాభ, నష్టాలపై చర్చించింది. తాజా ఆఫర్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ గత ఆరునెలల సగటు షేరు ధరతో  పోలిస్తే 17-20శాతం ప్రీమియంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందపు పూర్తి వివరాలను జీ యాజమాన్యం నేడు ప్రకటించే అవకాశం ఉంది.  కామ్‌కాస్ట్‌కు నిర్వహణా వాటాను విక్రయిస్తే ఎస్సెల్‌ గ్రూప్‌ అధిపతి సుభాష్‌చంద్ర ...జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ యాజమాన్యాన్ని వదులుకోవాల్సివుంటుంది. పాక్షిక వాటాను ఫైనాన్షియల్‌ ఇన్వెస్టరుకు విక్రయిస్తే యాజమాన్య నిర్వహణ ఆయన చేతుల్లోనే వుంటుంది కనుక...ఫైనాన్షియల్‌ ఇన్వెస్టరు డీల్‌నే ఎస్సెల్‌ గ్రూప్‌ ఖరారు చేయవచ్చన్న అంచనాలు మార్కెట్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు 5 శాతంపైగా క్షీణించి రూ. 361 వద్ద ముగిసింది.  జూలై 19 చివరి నాటికి కంపెనీలో మొత్తం రూ.35.79శాతంగా ఉంది. ఈ మొత్తంలో మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇతర ఫైనాన్సియల్‌ ఇన్వెస్టర్లు 63.98శాతం వాటాను తనఖా పెట్టారు. ప్రమోటర్ల మొత్తం వాటా ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.13,103 కోట్లుగా ఉంది. జీ యాజమాన్యం ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందుగా బోర్డు, రుణాదాతలు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం విజయవంమైతే తీవ్ర రుణ సంక్షోభాన్ని ఎదుర్కోంటున్న ఎస్సెల్‌కు గ్రూప్‌నుకు కొంతమేర ఊరట లభిస్తుంది.



You may be interested

11,100 పైన నిఫ్టీ ముగింపు

Wednesday 31st July 2019

మెటల్‌, ఫార్మా, అటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రెండురోజుల వరుస నష్టాలకు విరామం లభించింది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 11,100 పైన 11,113.80  వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 83.88 పాయింట్లు పెరిగి 37,481.12 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలతో నేడు మార్కెట్‌ నష్టంతో మొదలైంది. ఒకదశంలో అమ్మకాలు తీవ్రతరం కావడంతో నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 10,999 స్థాయికి పతనమైంది.

వేలం వెర్రిగా కొన్నారు.. వేగంగా విక్రయిస్తున్నారు!

Wednesday 31st July 2019

ఎఫ్‌పీఐ వాటాలు ఎక్కువున్న స్టాకుల్లో డౌన్‌ట్రెండ్‌ లబోదిబోమంటున్న చిన్న ఇన్వెస్టర్లు ఎకానమీపై ఆశలతో దేశీయ మార్కెట్లోని కొన్ని స్టాకుల్లో ఎఫ్‌పీఐలు(విదేశీ సంస్థాగత మదుపరులు) భారీగా వాటాలు కొనుగోలు చేశారు. దాదాపు 38 బీఎస్‌ఈ స్టాకుల్లో ఎఫ్‌పీఐలకు దాదాపు మూడింట ఒకవంతు వాటా ఉంది. అయితే బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. ఒకదశలో వేలంవెర్రిగా కొన్న స్టాకులను సైతం ఎఫ్‌పీఐలు మొహమాటం లేకుండా భారీగా విక్రయిస్తున్నాయి. దీంతో ఎఫ్‌పీఐలకు వాటాలున్న స్టాకుల్లో కేవలం

Most from this category