News


మా వాటాలో 50 శాతం అమ్మేస్తాం

Wednesday 14th November 2018
news_main1542174360.png-21985

న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జీల్‌) ప్రమోటర్లు కంపెనీలో తమకున్న వాటాలో 50 శాతం వరకు వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించే ఆలోచనతో ఉన్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలిపింది. దీపావళి వారంతంలో కంపెనీ ప్రమోటర్లు సుభాష్‌చంద్ర, అతని కుటుంబం, సలహాదారులతో ముంబైలో సమావేశమై అంతర్జాతీయంగా మీడియా స్వరూపాలు మారిపోతున్న క్రమంలో తమ వ్యాపార వ్యూహాలను సమీక్షించినట్టు పేర్కొంది. కంపెనీలో ఎస్సెల్‌ హోల్డింగ్స్‌కు ఉన్న వాటాల్లో 50 శాతం పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలియజేసింది. ఎస్సెల్‌ గ్రూపు నిధుల కేటాయింపు అవసరాల కోసం, అదే సమయంలో పెద్ద ఎత్తున టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో, టెక్నాలజీ మీడియా కంపెనీగా పరిణామం చెందేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తమ నిర్ణయం వెనుక ఉద్దేశ్యాలను వివరించింది. అలాగే, వ్యాపారం బలోపేతం కారణంగా కంపెనీ వాటాదారుల విలువ సైతం పెరుగుతుందని పేర్కొంది. సరైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామి ఎంపిక అన్నది వేగంగా మారిపోతున్న టెక్నాలజీలకు అనుగుణంగా కంపెనీని మార్చివేయడంలో సాయపడుతుందని అభిప్రాయపడింది. ఇందు కోసం గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా)ను ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గాను, లయన్‌ట్రీని అంతర్జాతీయ సలహాదారుగాను నియమించుకోవాలని నిర్ణయించింది. సెప్టెంబర్‌ త్రైమాసికం చివరికి జీల్‌లో ప్రమోటర్ల గ్రూపుకు 41.62 శాతం వాటా ఉంది. మంగళవారం నాటి షేరు క్లోజింగ్‌ దర రూ.438.20 ప్రకారం ప్రమోటర్ల వాటాల విలువ రూ.17,517 కోట్లు చేస్తుంది. You may be interested

రూ12,000 కోట్లను పంప్‌ చేయనున్న ఆర్‌బీఐ

Wednesday 14th November 2018

ముంబై: ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా వ్యవస్థలోకి రూ.12,000 కోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ‘‘లిక్విడీటీ పరిస్థితులను అంచనా వేసిన అనంతరం నవంబర్‌ 15న రూ.12,000 కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీలను ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ కింద కొనుగోలు చేయాలని నిర్ణయించాం’’ అని ఆర్‌బీఐ ప్రకటన జారీ చేసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం అనంతరం మార్కెట్లో ఏర్పడిన ద్రవ్య లభ్యత ఇబ్బందులను తాజా ఆర్‌బీఐ నిర్ణయం తేలిక పరచగలదని

జేఎస్‌పీఎల్‌ లాభం రూ.279 కోట్లు

Wednesday 14th November 2018

న్యూఢిల్లీ: జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ (జేఎస్‌పీఎల్‌) సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మంచి పనితీరు చూపించింది. రూ.279 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.499 కోట్ల నష్టాలను చవిచూడడం గమనార్హం. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే 63 శాతం పెరిగి రూ.9,983 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయాలు సైతం రూ.9,892 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది

Most from this category