News


జీ ఎంటర్‌టైన్మెంట్‌ లాభాలు రూ.412 కోట్లు

Friday 18th October 2019
news_main1571373516.png-28967

  • 7 శాతం వృద్ధి 
  • 8 శాతం వృద్ధితో రూ.2,190 కోట్లకు ఆదాయం

 న్యూఢిల్లీ: మీడియా సంస్థ, జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.412 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో వచ్చిన నికర లాభం, రూ.386 కోట్లతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,035 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.2,190 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ పునీత్‌ గోయెంకా చెప్పారు. దేశీయ బ్రాడ్‌కాస్ట్‌, డిజిటల్‌ విభాగాల పనితీరు పటిష్టంగా ఉండటంతో మంచి వృద్ధి సాధించామని పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు రూ.1,386 కోట్ల నుంచి 9 శాతం పెరిగి రూ.1,514 కోట్లకు చేరాయని వివరించారు. ఎంటర్‌టైన్మెంట్‌ పోర్ట్‌ఫోలియోలో అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. 

రూ.1,225 కోట్ల చందా ఆదాయం...
గత క్యూ2లో రూ.1,211 కోట్లుగా ఉన్న ప్రకటనల ఆదాయం  ఈ క్యూ2లో రూ.1,225 కోట్లకు పెరిగిందని గోయెంకా తెలిపారు. చందా ఆదాయం రూ.608 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.724 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, పటిష్టమైన నిర్వహణ పనితీరు కారణంగా ప్రకటనల, చందా ఆదాయాల్లో పరిశ్రమలోనే అగ్రస్థాయి వృద్ధిని సాధించామని వివరించారు. 



You may be interested

22 శాతం తగ్గిన సైయంట్‌ లాభం

Friday 18th October 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇంజనీరింగ్‌ సర్వీసుల కంపెనీ సైయంట్‌ సెప్టెంబరు క్వార్టర్‌ కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికరలాభం 22.5 శాతం తగ్గి రూ.98.5 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు 2.4 శాతం తగ్గి రూ.1,159 కోట్లుగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.6 మధ్యంతర డివిడెండు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది.

స్టార్టప్‌లకు భారత్‌ స్వర్గధామం

Friday 18th October 2019

మూడో అతిపెద్ద దేశంగా పేర్కొన్న హరూన్‌  ముంబై: విజయవంతమైన ఎక్కువ స్టార్టప్‌లను కలిగిన మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌గా భారత్‌ను ‘హరూన్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ జాబితా 2019’ గుర్తించింది. చైనా, అమెరికా తర్వాత స్థానాన్ని మనకు కేటాయించింది. వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ (10 బిలియన్‌ డాలర్లు), ఓలా క్యాబ్స్‌ (6 బిలియన్‌ డాలర్లు), బైజూస్‌ (6 బిలియన్‌ డాలర్లు), ఓయోరూమ్స్‌ (5 బిలియన్‌ డాలర్లు) మన దేశం నుంచి విజయం సాధించిన

Most from this category