News


చైనా కరెన్సీ మ్యానిప్యూలేటర్‌ కాదు..!

Tuesday 14th January 2020
Markets_main1578989658.png-30921

  • స్పష్టం చేసిన అమెరికా

గత కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఈ వాణిజ్య సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు అడుగులు పడుతున్న క్రమంలో చైనా ‘‘కరెన్సీ మ్యానిప్యూలేటర్‌’’ అనే ముద్రను అమెరికా  తొలగించింది. యువాన్‌ బలోపేతం అయిందని, చైనాను కరెన్సీ మ్యానిప్యూలేటర్‌గా పరిగణించడం లేదని అమెరికా ట్రెజరీ కాంగ్రెస్‌కు ఇచ్చిన సెమీ వార్షిక నివేదికలో పేర్కొంది. ఇక ఆగస్టు నెలలో చైనా తన కరెన్సీని బలహీనపరుస్తూ నిర్ణయం తీసుకోవడంపై ట్రంప్‌ స్పందిస్తూ చైనా తమ వ్యాపారాలను, ఫ్యాక్టరీలను దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇది  దీర్ఘకాలిక ఆందోళనకు గురిచేస్తుందని పేర్కొన్నారు. గత ఆగస్టులో చైనా అధికారిక వర్గాలు  దశాబ్దంలో మొదటి సారి యువాన్‌ను డాలర్‌కంటే 7 దిగువకు యువాన్‌ను బలహీన పరిచి, స్టాక్‌ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించడంతో ట్రంప్‌ ఆగ్రహం మరింత ఎక్కువైయింది. వేసవి నుంచే చైనా తన కరెన్సీ విలువను తగ్గించుకుంటుందని, దాంతో 11 ఏళ్లుగా ఉన్న ఆర్‌ఎమ్‌బీ (యువాన్‌) డాలర్‌కంటే మరింత దిగజారిందని అమెరికా ట్రెజరీ పేర్కొంది. అయితే ఇటీవల  యువాన్‌ డాలర్‌కు 6.93 బలోపేతం అయిందని, ప్రస్తుతం వాణిజ్య ఒప్పందం కరెన్సీ సమస్యలను పరిష్కరిస్తుందని ట్రెజరీ తెలిపింది. మార్కెట్‌ పోటీ ప్రయోజనాల కోసం కరెన్సీ మారకం రేటు లక్ష్యంగా చేసుకోకుండా ఉండేందుకు చైనా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసిందని  ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్‌ మ్నుచిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. You may be interested

ఈ షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ బుల్లిష్‌!

Tuesday 14th January 2020

సోమవారం ముగింపు ప్రకారం 63 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోంది. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఇన్ఫోసిస్‌, టాటాస్టీల్‌, కోల్‌ ఇండియా, అదానీ పవర్‌, జస్ట్‌ డయిల్‌, అవెన్యూ సూపర్‌ మార్ట్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, బీఈఎల్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, పెట్రోనెట్‌, టాటాకాఫీ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు

నిధుల సమీకరణపైనే యస్‌బ్యాంక్‌ మనుగడ

Tuesday 14th January 2020

యస్‌బ్యాంక్‌ షేరుకు రూ.10వేల కోట్ల నిధుల సమీకరణ అంశం భరోసాను ఇవ్వలేకపోయింది. ఫలితంగా షేరు పతనం వరుసగా 3వ రోజూ కొనసాగుతుంది. బుధవారం మరో 8.50శాతం క్షీణించి మొత్తంగా 19శాతాన్ని నష్టపోయింది. జనవరి 10న జరిగిన బ్యాంకు బోర్డు సమావేశంలో డెట్‌, ఈక్విటీల ద్వారా రూ.10వేల కోట్ల నిధులను సేకరణకు ఆమోదం తెలిపింది. ఇర్విన్‌ సింగ్‌ బ్రెయిచ్‌/ఎస్‌పీజీపీ హోల్డింగ్స్‌ ప్రతిపాదిత ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫర్‌తో కొనసాగకూడదని బోర్డు నిర్ణయించింది. సిటాక్స్‌ ఇన్వెస్ట్‌

Most from this category