STOCKS

News


భారత రాజకీయాలపై ఆర్థిక అభద్రతా ప్రభావం

Saturday 23rd November 2019
news_main1574480988.png-29801

  • యువత నిరుద్యోగ సమస్యపై

ఈఐయూ విశ్లేషణ న్యూఢిల్లీ: భారత్‌ యువతలో ఆర్థిక అభద్రతాభావం నెలకొందనీ, దేశ రాజకీయాలపై దీని ప్రభావం పెరుగుతోందని ఎకనమిస్ట్‌ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) పరిశోధనా నివేదిక ఒకటి పేర్కొంది. దేశాభివృద్ధిలో మందగమన ధోరణులు, నిరుద్యోగ సమస్యలను నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది. భారత్‌ నిరుద్యోగ సమస్య దేశ రాజకీయాలతో విడదీయరాని అంశంగా రూపొందుతోందని నివేదిక పేర్కొంది, ఒక రకంగా చెప్పాలంటే యువత ఆర్థిక అభద్రతాభావమే దేశ రాజకీయాలకు ఒక రూపునిచ్చే పరిస్థితి నెలకొంటోందని విశ్లేషించింది. ఆర్థిక వృద్ధి మందగమనం నిరుద్యోగ సమస్యను  తీవ్రతరం చేసిందని వివరించింది. ‘‘పటిష్ట నాయకత్వం, సామాజిక, భద్రతా అంశాల ప్రాతిపదికన ఈ ఏడాది రెండవసారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ విజయం సాధించినప్పటికీ,  పెద్ద సంఖ్యలో ఉన్న యువత ఆర్థిక అభద్రతాభావమే దేశ రాజకీయాలకు ఒక రూపునిస్తున్న పరిస్థితి పెరుగుతోంది’’ అని ఈఐయూ పేర్కొంది.

స్వల్పకాలిక ఉద్దీపనలతో ఫలితం ఉండదు!
 సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ డేటాను ఈఐయూ నివేదిక ప్రస్తావిస్తూ, ‘‘2019 సెప్టెంబర్‌లో 7.2 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు మరుసటి నెల అక్టోబర్‌లోనే మూడేళ్ల గరిష్ట స్థాయి 8.5 శాతానికి పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. పెద్ద సంఖ్యలో ఉన్న యువతను చక్కటి మానవ వనరుగా వినియోగించుకుంటూ,  రానున్న కొద్ది దశాబ్దాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందాలని దేశం భావిస్తున్నప్పటికీ, ఉపాధి కల్పనలో మాత్రం వెనుకబడుతున్నట్లు విశ్లేషించింది.  భారత్‌ తన ఉపాధి కల్పనా శాతాన్ని తగిన స్థాయిలో నిలబెట్టుకోడానికి వార్షికంగా 81 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాల్సి ఉంటుందని 2018లో ప్రపంచబ్యాంక్‌ అంచనావేసింది. దేశ ఉపాధి కల్పనలో స్వల్పకాలిక ఉద్దీపన చర్యలు తగిన ఫలితాలను ఇవ్వబోవని పేర్కొన్న నివేదిక, ఈ దిశలో​వ్యవస్థాగత సంస్కరణలే తగిన ఫలాలను అందిస్తాయని వివరించింది. 
 You may be interested

బీపీసీఎల్‌, కాంకర్‌ విక్రయానికి బిడ్లకు ఆహ్వానం

Saturday 23rd November 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బీపీసీఎల్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌ (కాంకర్‌)లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్‌) ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం పలికింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వం పూర్తి వాటాను విక్రయించనుండగా, కాంకర్‌లో మాత్రం 24 శాతం మేర వాటాను తన వద్దే అట్టిపెట్టుకుని మిగిలిన వాటాను, యాజమాన్య నియంత్రణను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టనుంది. బీపీసీఎల్‌కు అసోంలో ఉన్న నుమాలిగఢ్‌ రిఫైనరీని మాత్రం ప్రభుత్వరంగ

2021 మే నాటికి ‘వీర’ అనంత ప్లాంటు

Saturday 23rd November 2019

చిన్న ఎలక్ట్రిక్‌ బస్సులూ తయారీ మొత్తం రూ.1,300 కోట్ల పెట్టుబడి ప్లాంటుతో 6,500 మందికి ఉపాధి సాక్షితో సంస్థ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- బస్సుల తయారీలో ఉన్న బెంగళూరు కంపెనీ వీర వాహన ఉద్యోగ్‌ అనంతపూర్‌లో నెలకొల్పనున్న ప్లాంటు 2021 మే నాటికి సిద్ధం కానుంది. గుడిపల్లి వద్ద కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 120 ఎకరాల స్థలం కేటాయించింది. నిర్మాణ పనులు ప్రారంభించామని వీర వాహన ఉద్యోగ్‌ ఎండీ కె.శ్రీనివాస్‌ రెడ్డి

Most from this category