News


మీ డిపాజిట్లు భద్రంగానే ఉన్నాయి!

Thursday 12th March 2020
news_main1583997351.png-32432

ఆయా బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారుల నగదు మొత్త భద్రంగానే ఉందని ప్రవేట్‌ బ్యాంకులు కస్టమర్లకు భరోసా ఇస్తున్నాయి. యస్‌బ్యాంక్‌ సంక్షోభం మిగాతా బ్యాంకులపై ఆటువ్యాధిలా వ్యాపిస్తుండడంతో సదరు బ్యాంకులన్నీ తమ పొజీషన్‌, బ్యాంకు స్థితిగతుల గురించి కస్టమర్లకు వివరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్‌బీఎల్‌, కర్ణాటక బ్యాంక్‌, సౌత్‌ఇండియన్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా, కరూర్‌ వైశ్యా, ఎస్‌బీఐలు ప్రత్యేకమైన కమ్యూకేషన్స్‌ ద్వారా బ్యాంకు ఫైనాన్సియల్‌ పరిస్థితి బాగానే ఉందని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమ కస్టమర్లకు చెబుతున్నాయి.ఆదివారం బ్యాంక్‌ డిపాజిటర్ల భద్రతపై ఆర్బీఐ ఇచ్చిన వివరణకు కొనసాగింపుగా ఆయా బ్యాంకులు కస్టమర్లకు బ్యాంకులపై నమ్మకాన్ని కలిగించే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కాగా దేశంలోని వివిధ బ్యాంకుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆర్బీఐ పరిశీలిస్తుందని, మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దనీ ఆర్బీఐ ట్వీట్‌ చేసింది.



You may be interested

రిలయన్స్‌ టార్గెట్‌ ధర పెంచిన యూబీఎస్‌

Thursday 12th March 2020

ముంబై: అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. టార్గెట్‌ ధరను రూ.1840గా నిర్ణయించింది. కేటాయించిన టార్గెట్‌ ధర వచ్చే ఏడాదిలో ప్రస్తుత షేరు ధర నుండి 60 శాతం అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది. ఈ ఏడాది స్టాక్ ధరలో బాగా క్షీణించడం ఇంధన వ్యాపారానికి ఎటువంటి విలువను కేటాయించలేదని సూచిస్తుంది. స్టాక్ ధరల ప్రస్తుత క్షీణత ఇన్వెస్లర్లకు ఇంధన వ్యాపారాన్ని ఉచితంగా కొనుగోలు

ట్రావెల్‌ బ్యాన్‌ -ఎయిర్‌లైన్‌ షేర్లు కుదేల్‌

Thursday 12th March 2020

20 శాతం కుప్పకూలిన స్పైస్‌జెట్‌ 18 శాతం పతనమైన ఇంటర్‌గ్లోబ్‌ 52 వారాల కనిష్టాన్ని తాకిన షేర్లు  ప్రపంచ మహమ్మారి వ్యాధిగా ప్రకటితమైన కరోనా వైరస్‌ ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తవచ్చన్న అంచనాలు అటు ఈక్విటీ మార్కెట్లతోపాటు.. ఇటు ముడిచమురు ధరలను సైతం దెబ్బతీస్తున్నాయి. దీంతో రక్షణాత్మక పెట్టుబడులుగా భావించే బంగారం, యూఎస్‌ ట్రెజరీ బాండ్లకు గిరాకీ పెరుగుతోంది. ఫలితంగా బాండ్ల ఈల్డ్స్‌ కనిష్టాలకు పడిపోతుంటే.. అమెరికాసహా పలు ఈక్విటీ

Most from this category