News


లింక్‌కాని పాన్‌వాడితే.. పదివేలు కట్టాల్సిందే!

Monday 2nd March 2020
news_main1583140162.png-32222

ఆధార్‌ కార్డుకు పాన్‌ కార్డును లింక్‌ చేయకపోతే భారీ జరిమాన చెల్లించక తప్పదని ఐటీ విభాగం హెచ్చరిస్తోంది. మార్చి 31 నాటికి ఆధార్‌ నంబరుకు పాన్‌ కార్డును లింక్‌ చేయకపోతే పాన్‌ కార్డును రద్దు చేస్తారు. ఇలా రద్దైన కార్డును ఎక్కడైనా వాడితే ఆదాయపు పన్ను  చట్టంలోని సెక‌్షన్‌ 272బి ప్రకారం రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికార యంత్రాంగం వెల్లడించింది. ఇప్పటిదాక ఎవరైతే పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేయలేదో వారంతా మార్చి 31 లోపు లింక్‌ చేసుకోవాలని ఈ సందర్భంగా మరోసారి తెలిపింది. ఇప్పటికే రెండుసార్లు గడువును పొడిగించిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌  (సీబీడీటీ) ఫిబ్రవరి 13న మూడోసారి.. మార్చి 31లోపు పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేసుకోవాలని,  లేదంటే లింక్‌ కాని పాన్‌కార్డులు ఏప్రిల్‌ 1 నుంచి చెల్లవని స్పష్టం చేసింది. కాగా పాన్‌ కార్డు లేనివాళ్లు బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోలు, విక్రయాలు, స్టాక్‌ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడులు వంటి ఆర్థిక లావాదేవీలు జరపలేరు.
 



You may be interested

ఈ స్టాక్స్‌ చూడొచ్చు

Monday 2nd March 2020

విదేశీ మార్కెట్లే దిక్సూచి! నిఫ్టీ 11,000 దిగువకు తగ్గవచ్చు 11,535ను అధిగమిస్తే బుల్స్‌కు బలం రాజేష్‌ పల్వియా, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ వారాంతాన కనిపించిన పతనం ప్రకారం ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 11,000 పాయింట్ల స్థాయి దిగువకు చేరే అవకాశముందంటున్నారు యాక్సిస్‌ సెక్యూరిటీస్‌.. టెక్నికల్‌, డెరివేటివ్‌ రీసెర్చ్ హెడ్‌, రాజేష్‌ పల్వియా. అయితే నిఫ్టీ 11,535ను అధిగమిస్తే.. బుల్‌ ఆపరేటర్లకు బలమొస్తుందని పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఇంకా పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. చైనాలో

మార్కెట్‌ ర్యాలీకి కారణలివే..!

Monday 2nd March 2020

కేంద్ర బ్యాంకుల నుంచి వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు  కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌ ఇంట్రాడేలో 785పాయంట్లు పెరిగిన సెన్సెక్స్‌ 231 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ  వరుసగా ఆరు ట్రేడింగ్‌ సెషన్‌ భారీ పతనం తర్వాత భారత స్టాక్‌మార్కెట్‌ భారీ లాభాల్ని నమోదు చేసింది. ప్రధాన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ఏకంగా 2శాతం లాభాల్ని ఆర్జించాయి. మందగించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు పలుదేశాల కేంద్ర బ్యాంకులు ఉద్దీపన చర్యలు ప్రకటించడటం, వడ్డీరేట్లను తగ్గించడం లాంటి ఆర్థిక చర్యలకు పూనుకోవచ్చనే

Most from this category