News


భీమ్ యూపీఐతో ఫాస్టాగ్‌ రీచార్జ్

Friday 27th December 2019
news_main1577419089.png-30467

న్యూఢిల్లీ: నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌ఈటీసీ) ఫాస్టాగ్‌లను భీమ్ యూపీఐ ద్వారా కూడా రీచార్జ్ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. దీనితో ఫాస్టాగ్‌ రీచార్జ్ ప్రక్రియ మరింత సులభతరం కాగలదని సంస్థ సీవోవో ప్రవీణ రాయ్‌ తెలిపారు. టోల్ చెల్లింపునకు సంబంధించి వాహనదారుల సమయం వృధా కాకుండా చూసే దిశగా ఫాస్టాగ్ విధానం ఇటీవలే అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ అకౌంటుకు అనుసంధానించే ఫాస్టాగ్‌ ట్యాగ్‌లను వాహనం విండ్‌స్క్రీన్‌పై అతికిస్తారు. టోల్‌ప్లాజాల్లో  ఏర్పాటు చేసిన రీడర్లు వీటిని స్కాన్‌ చేశాక.. వాహనదారు ఖాతా నుంచి నిర్దేశిత టోల్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. దీనివల్ల టోల్‌ ప్లాజాల్లో వాహనాల రద్దీ తగ్గడంతో పాటు వాహనదారుల సమయం కూడా ఆదా అవుతుంది. 



You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌...నిఫ్టీ 46 పాయింట్లు జూమ్‌

Friday 27th December 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో శుక్రవారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 138 పాయింట్ల లాభంతో 41,302 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 46 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,172 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌ 27-12-19

Friday 27th December 2019

దేశీ స్టాక్‌ మార్కెట్లలో వార్తల ఆధారంగా శుక్రవారం(27-12) కొన్ని స్టాక్స్‌ యాక్టివ్‌గా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా వార్తలలో నిలిచిన ఆయా కంపెనీల వివరాలు చూద్దాం. హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) నుంచి హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌(HAM)లో రూ. 522 కోట్ల విలువైన రహదారి కాంట్రాక్టు లభించినట్లు మౌలిక సదుపాయాల సంస్థ హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ తెలియజేసింది. దీనిలో భాగంగా హార్యానాలోని రేవరీ బైపాస్‌ను నిర్మించవలసి ఉంటుందని

Most from this category