News


ఆ దేవుడినే అడగండి..ఇన్ఫోసిస్‌పై సెబీ చీఫ్‌

Friday 8th November 2019
news_main1573210648.png-29456

తాజాగా వార్షిక విశ్లేషకుల సమావేశంలో ‘దేవుడు కూడా ఇన్ఫోసిస్‌ నెంబర్లను మార్చలేడు’ అని వ్యాఖ్యానించిన ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నిలేకని వ్యాఖ్యలపై సెబీ(సెక్యురిటీస్‌, ఎక్సేంజ్‌ బోర్డు) చైర్మన్‌ అజయ్‌ త్యాగి స్పందించారు. సీఐఐ క్యాపిటల్‌ మార్కెట్‌ సమ్మిట్‌లో పాల్గోన్న అజయ్‌ త్యాగిని మీడియావారు ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు ‘అతన్నే మీరు అడగాలి(నిలేకని) లేదా దేవుడిని అడగాలి. నేను చెప్పడానికి ఏం లేదు’ అని వ్యాఖ్యాలు చేశారు. కాగా ఇన్వెస్టర్లు తమకు తాముగా ఒక నిర్ణయం తీసుకోవాలని, ఇన్ఫోసిస్‌పై దర్యాప్తు చేస్తున్నామని, అమెరికా సెక్యురిటీ ఎక్సేంజ్‌తో(యుఎస్‌ సెక్‌) కో‍ంత సమాచారాన్ని పంచుకున్నామని, ఇది ఇరు నియంత్రణ సంస్థల మధ్య గోప్యంగా ఉంటుందని సెబీ ఓ ప్రకటనను విడుదల చేయడం గమనార్హం. ఇన్ఫోసిస్‌ విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదుపై సెబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. 
   కాగా నవంబర్‌ 5 న జరిగిన కంపెనీ వార్షిక విశ్లేషకులు సమావేశంలో,  కంపెనీ సొంత దర్యాప్తులో విజిల్‌ బ్లోయర్స్‌ ఫిర్యాదును బలపరిచే ఆధారాలు లభించలేదని ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌నిలేకని అన్నారు. అంతేకాకుండా దేవుడు కూడా ఇన్ఫోసిస్‌ నెంబర్లను మార్చలేడని ధీమా వ్యక్తం చేశారు. 
ఇన్ఫోసిస్‌ విజిల్‌బ్లోవర్‌..  
  ఇన్ఫోసిస్‌ స్వల్ప కాలంలో లాభాలు, ఆదాయాలు పెంచుకోడానికి అనైతిక పద్ధతులను అనుసరిస్తోందని, కంపెనీలో ‘నైతికమైన ఉద్యోగులు’గా తమను తాము పిలుచుకునే ఓ గ్రూప్‌, కంపెనీ సీఈఓ సలీల్‌ పరేఖ్‌, సీఎఫ్‌ఓ నిరంజన్‌ రాయ్‌కు వ్యతిరేకంగా కంపెనీ బోర్డుకు, యుఎస్‌ సెక్యురిటీస్‌, ఎక్సేంజ్‌ కమిషన్‌(ఎస్‌ఈసీ-సెక్‌)కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై యుఎస్‌ సెక్‌, సెబీ దర్యాప్తును ప్రారంభించాయి.



You may be interested

మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌తో మార్కెట్‌ డౌన్‌..!

Friday 8th November 2019

12000 దిగువన ముగిసిన నిఫ్టీ 330 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌  మూడు రోజులుగా  రికార్డు ర్యాలీ చేస్తున్న మార్కెట్‌ మూడ్‌ను ‘‘మూడీస్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌’’ దెబ్బతీసింది. ఫలితంగా ఈ వారాంతాన్ని సూచీలు నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్‌ 330 పాయింట్లు నష్టపోయి 40323 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 12000 దిగువున 11908 వద్ద స్థిరపడ్డాయి. ఆర్థిక, సంస్థాగత బలహీనతలను మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమైందని భారత క్రెడిట్‌ రేటింగ్స్‌ అవుట్‌లుక్‌ను నెగిటివ్‌కి తగ్గిస్తున్నట్లు

20కిపైగా కంపెనీలకు మూడీస్‌ షాక్‌!

Friday 8th November 2019

ప్రకటించిన మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ భారత ఎకానమీ అవుట్‌లుక్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన మూడీస్‌ తాజాగా పలు షేర్ల అవుట్‌లుక్‌ను పునఃసమీక్షించింది. ఈ సమీక్షలో ఆరు ఫైనాన్షియల్‌ సంస్థలు, 15నాన్‌ఫైనాన్షియల్‌ సంస్థల రేటింగ్‌ అవుట్‌లుక్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఐదు కంపెనీల రేటింగ్‌ అవుట్‌లుక్‌ను యథాతధంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దేశీయ విత్త దిగ్గజాలైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎగ్జిమ్‌బ్యాంక్‌, హీరో ఫిన్‌కార్‌‍్ప, హడ్కో, ఐఆర్‌ఎఫ్‌సీ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను స్థిరం నుంచి నెగిటివ్‌కి తగ్గించినట్లు మూడీస్‌

Most from this category