News


యస్‌ బ్యాంక్‌ ఎండీపై చర్యలు తీసుకోండి

Thursday 6th February 2020
news_main1580963660.png-31553

  • ఆర్‌బీఐకి బ్యాంక్ మాజీ డైరెక్టర్ అగర్వాల్ లేఖ

న్యూఢిల్లీ: నియంత్రణ సంస్థ నిర్దేశించిన పలు నిబంధనల ఉల్లంఘనకు గాను ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ సీఈవో, ఎండీ రవ్‌నీత్‌ గిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ బ్యాంక్‌ మాజీ డైరెక్టరు ప్రకాష్ అగర్వాల్ తాజాగా రిజర్వ్ బ్యాంక్‌కు లేఖ రాశారు. అనైతిక విధానాలతో బ్యాంకు బోర్డుపై గిల్ ఆధిపత్యం సాధించారని, క్విడ్ ప్రో కో లావాదేవీలతో బోర్డు సభ్యులను ప్రభావితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎలాంటి తీర్మానానికైనా ఆమోదం పొందగలిగే విధంగా మెజార్టీ సభ్యుల మద్దతు సాధించారని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు జనవరి 30న రాసిన లేఖలో అగర్వాల్ పేర్కొన్నారు. ఆగస్టులో రూ. 1,930 కోట్ల మూలధనం సమీకరణకు సంబంధించిన వ్యయాల పేరిట రూ. 21 కోట్లు దారి మళ్లించారని అగర్వాల్ ఆరోపించారు. గిల్ ఎండీగా చేరినప్పట్నుంచీ ఇప్పటిదాకా యస్ బ్యాంక్ మార్కెట్ విలువ ఏకంగా రూ. 40,000 కోట్లు హరించుకుపోయిందని తెలిపారు. 2018 నుంచి యస్ ‍బ్యాంక్‌లో స్వతంత్ర డైరెక్టరుగా ఉన్న అగర్వాల్ .. బ్యాంకులో కార్పొరేట్ ప్రమాణాలు పూర్తిగా దిగజారాయని ఆరోపిస్తూ ఇటీవలే రాజీనామా చేశారు. 



You may be interested

ఏజీఆర్‌ చెల్లింపులకు పదేళ్ల గడువు: వొడాఫోన్‌

Thursday 6th February 2020

5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలుకి నో: ఎయిర్‌టెల్‌  52 వారాల గరిష్టానికి ఎయిర్‌టెల్‌ షేరు 1 శాతం లాభంతో వొడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు పదేళ్ల గడువును ఇవ్వవలసిందిగా వొడాఫోన్‌ ఐడియా గ్రూప్‌ తాజాగా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఏజీఆర్‌ బకాయిలలో కలిసి ఉన్న వడ్డీలు, పెనాల్టీలను రద్దు చేయవలసిందిగా వొడాఫోన్‌ ఐడియా గ్రూప్‌ సీఈవో నిక్‌ రీడ్‌ కోరారు. వీటిని మినహాయించిన ఏజీఆర్‌ అసలు(ప్రిన్సిపల్‌) బకాయిలను చెల్లించేందుకు పదేళ్ల గడువును అభ్యర్థించారు. అంతేకాకుండా ఏజీఆర్‌

మూడింతలైన హెచ్‌పీసీఎల్‌ నికర లాభం

Thursday 6th February 2020

ఇన్వెంటరీ లాభాల వల్లే  రూ.74,288 కోట్లకు తగ్గిన టర్నోవర్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హిందుస్తాన్‌ పెట్రోలియమ్‌ కార్పొ(హెచ్‌పీసీఎల్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో మూడింతలైంది. గత క్యూ3లో రూ.248 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.747 కోట్లకు పెరిగిందని హెచ్‌పీసీఎల్‌ సీఎమ్‌డీ ముకేశ్‌ కె. సురానా వెల్లడించారు. గత క్యూ3లో రూ.3,465 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు రాగా, ఈ క్యూ3లో రూ.343 కోట్ల ఇన్వెంటరీ లాభాలు

Most from this category