News


యస్‌బ్యాంక్‌ కుప్పకూలనివ్వం!

Thursday 23rd January 2020
news_main1579757982.png-31129

ఎస్‌బీఐ చీఫ్‌
యస్‌బ్యాంకు సమస్యల నుంచి బయటపడి మనుగడ సాగించేందుకు కొన్ని పరిష్కారమార్గాలు తప్పక దొరుకుతాయని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ రజనీశ్‌ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మూలధన సమీకరణ కోసం యస్‌బ్యాంక్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే! ‘‘మార్కెట్‌లో యస్‌బ్యాంకు ఒక ప్రముఖమైన బ్యాంకు, దాదాపు 4000 కోట్ల డాలర్ల బాలెన్స్‌ షీటున్న బ్యాంకు’’ అని ఆయన దావోస్‌లో చెప్పారు. ఇంత ప్రాముఖ్యతున్న బ్యాంకు కుప్పకూలే పరిస్థితి రాదన్నది తన అభిప్రాయమన్నారు. యస్‌బ్యాంకును సంక్షోభం నుంచి బయటపడేసేందుకు యత్నించాలని ప్రభుత్వం ఎస్‌బీఐని కోరవచ్చన అంచనాల మధ్య రజనీశ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గత నెల్లో యస్‌బ్యాంకును బయటపడేసేందుకు ఎస్‌బీఐ ఎలాంటి ప్రయత్నం చేయదని రజనీశ్‌ వ్యాఖ్యానించారు. కేవలం నెలరోజుల్లోనే ఆయన అభిప్రాయాల్లో మార్పు కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పలు సంక్షోభాల కారణంగా యస్‌బ్యాంకు షేరు ఏడాదిగా భారీ కుంగుబాటుకు గురైంది. కొత్త సీఈఓ నాయకత్వంలో బ్యాంకు ఒడ్డున పడేందుకు పలు యత్నాలు చేస్తోంది. మూలధన సమీకరణను బ్యాంకు మరింత జాప్యం చేసేకొద్దీ ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన పెరుగుతుందని, దీంతో బ్యాంకుపై మరింత ఒత్తిడి పెరుగుతుందని ఎకనమిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యస్‌బ్యాంకు లాంటి మంచి బ్యాంకు పతనం కావడం ఎకానమీకి మంచిది కాదంటూ రజనీశ్‌ పేర్కొనడం గమనార్హం. బ్యాంకు సంక్షోభ పరిష్కారానికి తప్పక మార్గాలు కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రజనీశ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో యస్‌బ్యాంకు షేరు గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం లాభపడింది. 



You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Thursday 23rd January 2020

 చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో రక్షణాత్మక పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఆసక్తిచూపించిన నేపథ్యంలోగురువారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ ధర 3 డాలర్లు పెరిగి 1559.00 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయ ఎంసీఎక్స్‌లో10 గ్రాముల పసిడి ధర రూ.61 స్వల్ప లాభంతో రూ. 39974 వద్ద కదులుతోంది.   

ఎల్‌అండ్‌టీ టెక్‌, ఉజ్జీవన్‌ జోరు- ఐటీఐ బోర్లా

Thursday 23rd January 2020

కరోనా వైరస్‌ భయాలతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు నీరసించినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో కదులుతున్నాయి. ఉదయం 10.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ చేసింది. 208 పాయింట్లు పెరిగి 41,324కు చేరింది. నిఫ్టీ సైతం 63 పాయింట్లు పుంజుకుని 12,169 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా ఐటీ సేవల కంపెనీ ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌, ఉజ్జీవన్‌

Most from this category