News


మార్చి 18 నుంచి పూర్తి సేవలు అందుబాటులోకి: ఆర్‌బీఐ

Tuesday 17th March 2020
news_main1584414860.png-32518

పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18 సాయంత్రం నుంచి యస్‌ బ్యాంక్‌పై మారటోరియం తొలగిపోయి, అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. దీంతో ఖాతాదారులు .. ఆంక్షలేమీ లేకుండా విత్‌డ్రాయల్స్‌ లావాదేవీలు జరపవచ్చని పేర్కొన్నారు.  బ్యాంకును ఆదుకునేందుకు అవసరమైతే అదనంగా నిధులు కూడా సమకూరుస్తామని హామీ ఇచ్చారు. యస్‌ బ్యాంక్‌ ఇకపైనా ప్రైవేట్‌ సంస్థగానే కొనసాగుతుందన్నారు. 'యస్‌' సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ.. మిగతా బ్యాంకింగ్‌ వ్యవస్థ పటిష్టంగానే ఉందని పేర్కొన్నారు. అటు యస్‌ బ్యాంక్‌ కూడా "మార్చి 18 నుంచి బ్యాంకింగ్‌ సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. మార్చి 19 నుంచి మా 1,132 శాఖలన్నింటిలోను వీటిని పొందవచ్చు" అని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేసింది. ఆర్‌టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్‌తో పాటు యూపీఐ ప్లాట్‌ఫాం, గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం మొదలైన వాటి ద్వారా కూడా లావాదేవీలు జరపవచ్చు. మరోవైపు, యస్‌ బ్యాంక్‌ ఆర్థికంగా స్థిరపడేందుకే అందులో పెట్టుబడులు పెడుతున్నామని, రాబడుల (ఆర్‌వోఐ) కోసం కాదని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. యస్‌ బ్యాంకులో ఎస్‌బీఐతో పాటు ఏడు బ్యాంకులు రూ. 10,000 కోట్ల పైగా ఇన్వెస్ట్‌ చేశాయి. 



You may be interested

ఈ నెల 31 తర్వాత పాన్‌ పనిచేయదు!

Tuesday 17th March 2020

పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి 15 రోజులే వ్యవధి న్యూఢిల్లీ: పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి అని, ఇందుకు ఇచ్చిన గడువు ఈ నెల 31న ముగుస్తుందంటూ ఆదాయపన్ను శాఖ మరోసారి గుర్తు చేసింది. గడువులోపు అనుసంధానాన్ని పూర్తి చేసుకోవాలని సూచించింది. గడువు నాటికి అనుసంధానం చేసుకోకపోతే.. అప్పుడు పాన్‌ పనిచేయకుండా పోతుందని హెచ్చరించింది. కనుక ఇచ్చిన అవకావాన్ని కోల్పోవద్దని సూచించింది. బయోమెట్రిక్‌ ఆధార్‌ ఆథెంటికేషన్‌ లేదా పాన్‌ సేవా కేంద్రాలను సందర్శించడం ద్వారా

19నే సూచీల నుంచి నిష్క్రమణ..!

Tuesday 17th March 2020

తాజా పరిస్థితుల నేపథ్యంలో గతంలో అనుకున్న దానికంటే ముందుగానే యస్‌ బ్యాంక్‌ను నిఫ్టీ సహా వివిధ సూచీల నుంచి తొలగించాలని ఎన్‌ఎస్‌ఈ ఇండిసెస్‌ ఇండెక్స్‌ మెయింటెనెన్స్‌ సబ్‌-కమిటీ నిర్ణయించింది. దీంతో ముందుగా అనుకున్నట్లు మార్చి 27న కాకుండా 19 నుంచే నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ 100, నిఫ్టీ 500 వంటి అన్ని ఈక్విటీ సూచీల నుంచి యస్‌ బ్యాంక్‌ నిష్క్రమించనుంది. నిఫ్టీ 50లో శ్రీ సిమెంట్, నిఫ్టీ

Most from this category