News


డిసెంబర్‌ ఆఖరుకల్లా నిధుల సమీకరణ

Monday 4th November 2019
news_main1572838119.png-29316

  • రూ. 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులపై 
  • యస్‌ బ్యాంక్ ప్రణాళిక
  • కొత్త ఇన్వెస్టర్లకు బోర్డులో స్థానం కల్పించే యోచన
  • 33 శాతం వాటాలకు అవకాశం

ముంబై: నిధుల వేటలో ఉన్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్.. ప్రతిపాదిత రూ. 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,462 కోట్లు) పెట్టుబడుల సమీకరణ ప్రక్రియను డిసెంబర్‌ ఆఖరునాటికల్లా పూర్తి యోచిస్తోంది. అలాగే, కొత్త ఇన్వెస్టర్లకు బోర్డులో కూడా స్థానం కల్పించాలని భావిస్తోంది. నిధుల సమీకరణ కోసం పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని, సుమారు 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 21,156 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు వారు సిద్ధంగా ఉన్నారని యస్‌ బ్యాంక్ వెల్లడించిన సంగతి తెలిసిందే. 'నార్త్ అమెరికన్ ఫ్యామిలీ ఆఫీస్' ఇప్పటికే 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆఫర్ ఇచ్చింది. దీనిపై నవంబర్ ఆఖరులోగా ఆ సంస్థకు తమ అభిప్రాయం తెలియజేయాల్సి ఉంటుందని విలేకరులకు యస్‌ బ్యాంక్ సీఈవో రవ్‍నీత్ గిల్ తెలిపారు. ఆ సంస్థ నుంచి లేదా పలువురు ఇన్వెస్టర్లందరి నుంచి కలిపి డిసెంబర్ ఆఖరు నాటికి నిధుల సమీకరణ జరపగలమని పేర్కొన్నారు. రుణ వృద్ధిని మెరుగుపర్చుకోవాలని నిర్దేశించుకున్న నేపథ్య౾ంలో వచ్చే రెండేళ్ల అవసరాలకు ఈ నిధులు సరిపోగలవని గిల్ చెప్పారు. ప్రస్తుతం అసెట్‌ క్వాలిటీపరమైన సమస్యలు కూడా అదుపులోనే ఉన్నాయన్నారు. మరోవైపు, సింగపూర్ సంస్థ డీబీఎస్‌.. తమ బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయడంపై ఆసక్తిగా ఉందంటూ వచ్చిన వార్తలను గిల్ కొట్టిపారేశారు. ‍అటు డీబీఎస్ కూడా ఈ వార్తలను ఖండించింది.  

ఓపెన్ ఆఫర్ అవసరం ఉండకపోవచ్చు..
1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో కొత్త ఇన్వెస్టరు లేదా ఇన్వెస్టర్లకు బ్యాంక్‌లో 33 శాతం వాటా దక్కుతుందని, ప్రస్తుత ఇన్వెస్టర్ల వాటాల్లో మూడో వంతు విక్రయించినట్లవుతుందని గిల్ చెప్పారు. ఇన్వెస్టర్ల ఓటింగ్ హక్కులను 15 శాతానికి పరిమితం చేయనుండటంతో ఓపెన్ ఆఫర్ అవసరం ఉండకపోవచ్చని, ఈ పెట్టుబడులకు ఆర్‌బీఐని ఒప్పింపచేయడంలో సమస్యలు ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాత ఉదాహరణలను పరిశీలిస్తే.. కొత్తగా వచ్చే ఇన్వెస్టరును 'ప్రమోటరు' హోదా ఉండకపోవచ్చన్నారు. షేర్ల విక్రయానికి రెండు వారాల సగటు లేదా ఆరు నెలల సగటును పరిగణనలోకి తీసుకోవచ్చని, కాస్త ప్రీమియం దక్కే అవకాశాలే ఉండగలవని ఆశిస్తున్నట్లు గిల్ చెప్పారు. నార్త్ అమెరికన్ ఫ్యామిలీ ఆఫీస్‌తో పాటు ఇతర ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు కూడా బోర్డులో సభ్యత్వం కోరాయని, ఆ విషయంలో బ్యాంకుకేమీ అభ్యంతరాలు లేవని ఆయన వివరించారు. 

ప్రతీ తూటా మాకే తగులుతోంది..
సెప్టెంబర్ క్వార్టర్‌లో మొండిబాకీలు భారీగా పెరగడంపై స్పందించిన గిల్‌.."పేలిన ప్రతీ టార్పిడో (నౌకా విధ్వంసక ఆయుధం) యస్‌ బ్యాంక్‌కే తగిలింది" అని వాపోయారు. కేఫ్ కాఫీడే, అల్టికో క్యాపిటల్‌, సీజీ పవర్‌, కాక్స్ అండ్ కింగ్స్‌ వంటి మొండిపద్దులు శతఘ్నుల్లా తమ నౌకను అస్తవ్యస్తం చేశాయని ఆయన పేర్కొన్నారు. కేవలం ఈ పద్దుల వల్లే ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడుకు దిగువ స్థాయిలో ఉన్న సంస్థలకిచ్చిన రుణాల పరిమాణం రూ. 4,000 కోట్లు ఎగసి.. రూ. 31,000 కోట్లకు చేరిందని గిల్ చెప్పారు. భవిష్యత్‌లో ఇది మరింత పెరగకపోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే వెల్లడైన ఆర్థిక ఫలితాల ప్రకారం జూన్‌ త్రైమాసికం ఆఖరు నాటికి 5.01 శాతంగా ఉన్న మొండిబాకీలు సెప్టెంబర్ క్వార్టర్ నాటికి 7.39 శాతానికి ఎగిసిన సంగతి తెలిసిందే. You may be interested

3,400 ప్రభుత్వరంగ బ్యాంకు శాఖలు మాయం

Monday 4th November 2019

న్యూఢిల్లీ: గడిచిన ఐదేళ్ల కాలంలో (2014-15 నుంచి 2018-19 వరకు) ప్రభుత్వరంగ బ్యాంకుల పరిధిలో 3,400 బ్యాంకు శాఖలు కనుమరుగయ్యాయి. అంటే వీటిని మూసేయడం లేదా విలీనం చేయడం జరిగింది. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య పెద్ద ఎత్తున విలీనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద ఆర్‌బీఐకి చేసుకున్న దరఖాస్తు ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా కనుమరుగైన వాటిల్లో 75

అప్పు చేసి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చా ?

Monday 4th November 2019

(ధీరేంద్ర కుమార్‌, వాల్యూ రీసెర్చ్‌ సీఈవో) ప్ర: నా వయస్సు 36 సంవత్సరాలు. తాతల నాటి ఆస్తి కేసు ఒక కొలిక్కి వచ్చి నా వాటాగా రూ.36 లక్షలు వచ్చాయి. ఈ డబ్బులను గృహ రుణం తీర్చడానికి వినియోగించాలా ?లేక రిటైర్మెంట్‌ అవసరాల కోసం ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలా ? తగిన సలహా ఇవ్వండి. - వంశీ, హైదరాబాద్‌ జ: ఈ డబ్బులను ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తేనే మంచిది. ఎవరైనా సరే

Most from this category