News


క్యూఐపీ ద్వారా యస్‌బ్యాంక్‌ రూ.1,930 కోట్లు సమీకరణ

Thursday 15th August 2019
news_main1565851084.png-27774

వ్యాపార విస్తరణకు వినియోగిస్తాం

న్యూఢిల్లీ: యస్‌బ్యాంక్‌ క్యూఐపీ ద్వారా రూ.1,930 కోట్లు సమీకరించింది. ఈ నెల 9న మొదలైన ఈ ఇష్యూ బుధవారం ముగిసిందని, ఈ నిధులను వ్యాపార విస్తరణకు వినియోగిస్తామని యస్‌బ్యాంక్‌ తెలిపింది. ఈ క్యూఐపీ ఇష్యూకు ఇష్యూ ధరగా రూ.83.55ను నిర్ణయించామని పేర్కొంది. ఫ్లోర్‌ ధర రూ.87.90తో పోల్చితే 5 శాతం డిస్కౌంట్‌తో ఇష్యూ ధరను ఖరారు చేశామని వివరించింది. వాటా మూలధనంలో 9.96 శాతానికి సమానమైన 23.10 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేశామని పేర్కొంది. బీఎస్‌ఈలో యస్‌బ్యాంక్‌ షేర్‌ 4 శాతం లాభంతో రూ.76.55 వద్ద ముగిసింది. 



You may be interested

అమ్మకానికి కాఫీ డే 'గ్లోబల్‌ పార్క్‌'

Thursday 15th August 2019

కొనుగోలు చేసిన బ్లాక్‌స్టోన్‌ డీల్‌ విలువ సుమారు రూ. 3,000 కోట్లు అల్ఫాగ్రెప్ సెక్యురిటీస్‌లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ఒప్పందం విలువ సుమారు రూ. 28 కోట్లు రుణభారం తగ్గించుకునేందుకే అమ్మకాలు  న్యూఢిల్లీ: వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమన్న వార్తల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ (సీడీఈ) తాజాగా రుణాల భారం తగ్గించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని గ్లోబల్‌ విలేజ్ టెక్‌ పార్క్‌ను అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌కు విక్రయించాలని

ఎగుమతులు పెరిగాయ్‌... దిగుమతులు తగ్గాయ్‌!

Thursday 15th August 2019

జూలైలో ఎగుమతులు 2.25 శాతం అప్‌ దిగుమతులు 10.43 శాతం క్షీణత వెరసి తగ్గిన వాణిజ్య లోటు  13.43 బిలియన్‌ డాలర్లుగా నమోదు న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు 2019 జూలైలో కేవలం 2.25 శాతం (2018 జూలైతో పోల్చి) పెరిగాయి. విలువ రూపంలో 26.33 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2018 జూలైలో ఈ విలువ 25.75 బిలియన్‌ డాలర్లు. కాగా  అయితే దిగుమతులు మాత్రం 10.43 శాతం తగ్గాయి. విలువ రూపంలో 39.76 బిలియన్‌ డాలర్లుగా

Most from this category