News


యస్‌బ్యాంకు ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Wednesday 17th July 2019
news_main1563344543.png-27123

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌బ్యాంకు బుధవారం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఆస్తుల నాణ్యతలో క్షీణత, బలహీన లోన్‌గ్రోత్‌ కారణంగా బ్యాంకు లాభాల్లో భారీ కోత ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే లాభంలో 80 శాతం పతనం ఉండొచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. దాదాపు రూ.10వేలపైచిలుకు ఒత్తిడిలో ఉన్న ఆస్తుల కారణంగా ప్రొవిజన్లు బాగా పెరిగి రూ. 1208 కోట్లకు చేరవచ్చని అంచనా. ఇందువల్ల మార్జిన్లపై ఒత్తిడి పెరగనుంది. ఈ కారణంగా లాభం 85 శాతం వరకు తగ్గవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్‌, 84 శాతం వరకు తగ్గుతుందని ప్రభుదాస్‌ లీలాధర్‌ అంచనా వేస్తున్నాయి. మూలధనం కొరత కారణంగా పలు వ్యాపార పారామీటర్లు మందగమనం నమోదు చేస్తాయని, ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పెరుగుదల ఎర్నింగ్స్‌లో అస్థిరతను తెస్తుందని వ్యాఖ్యానించాయి. నికర వడ్డీ ఆదాయంలో పెరుగుదల స్వల్పంగా ఉండొచ్చన్నాయి. లోన్‌గ్రోత్‌ 8 శాతానికి పడిపోవచ్చని, ఎన్‌ఐఎం ఒత్తిళ్ల కారణంగా రెవెన్యూలు మందగిస్తాయని, ఆస్తుల నాణ్యత మరింత క్షీణించవచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. జీఎన్‌పీఏలు 3.89 శాతానికి చేరతాయని బ్రోకరేజ్‌లు భావిస్తున్నాయి. బ్యాంకు కొత్త సీఈఓ కామెంటరీ భవిష్యత్‌పై అంచనానిస్తుందని తెలిపాయి. డిపాజిట్‌ గ్రోత్‌లో మెరుగుదల, మూలధన వినియోగం తదితర అంశాలను నిశితంగా పరిశీలించాలని తెలిపాయి. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 250 పాయింట్లు అప్‌

Wednesday 17th July 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో దాదాపు 1శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో ఈరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 30,622.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 250 పాయింట్లు మేర లాభపడింది. 30,800ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యా‍హ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు (30,570.80)తో పోలిస్తే 130 పాయింట్లు(దాదాపు అరశాతం)

ముందుంది ఐపీఓల పండుగ

Wednesday 17th July 2019

ఈ ఏడాది మొదటి 6 నెలలో 8 మాత్రమే గత ఏడాది ఇదే కాలంలో 24 కంపెనీలు      వచ్చే నెలలో అర డజను కంపెనీలు ఐపీఓకి  రావడానికి సిద్ధపడుతున్నాయి. రూ.10,000 కోట్లను సమీకరించడమే లక్ష్యంగా ఇవి ఐపీఓకి రానున్నాయి. స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌, ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌, స్పంధన స్ఫూర్తి ఫైనాన్సియల్‌, ఎఫ్ఫెల్‌ ఇండియా, ఏజీఎస్‌ ట్రాన్సక్ట్‌ టెక్నాలజీస్‌, మజగావ్‌ డాక్‌ షిప్‌ బుల్డర్స్‌ వంటి కంపెనీలు అగష్టు

Most from this category