News


ఫోన్‌పే పై యస్‌ బ్యాంక్‌ దెబ్బ!

Friday 6th March 2020
news_main1583485435.png-32333

 యస్‌ బ్యాంకుపై మారటోరియం విధిస్తూ గురువారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఫోన్‌పే సేవల్లో అంతరాయం ఏర్పడింది.  ఫోన్‌పే సహవ్యవస్థాపకులు, సీఈఓ  సమీర్‌ నిగమ్‌ శుక్రవారం ట్విటర్‌లో స్పందిస్తూ ఫోన్‌పే సేవల్లో అంతరాయం ఏర్పడినందుకు చింతిస్తున్నామని త్వరలోనే సేవలను పునరుద్దరిస్తామని తమ ఖాతాదారులకు తెలిపారు. మా భాగస్వామ్య బ్యాంక్‌ అయిన యస్‌ బ్యాంక్‌పై ఆర్బీఐ మారటోరియం విధించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. మా టీమ్‌ మొత్తం రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని త్వరలో ఫోన్‌పే సేవలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాగా యస్‌బ్యాంక్‌ ఖాతాదార్లు ఏప్రిల్‌ 3 వరకు నెలకు రూ.50,000 మాత్రమే ఒక్కో ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు వీలుంటుందని ఆర్బీఐ తెలిపింది. యస్‌బ్యాంక్‌ ఖాతాదారులు పెళ్లి, మెడికల్‌ ఎమర్జెన్సీ, ఎడ్యుకేషన్‌ వంటి అత్యవసరాలకు రూ.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఫోన్‌ పేతో పాటు అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌(ఏపీఐ) బ్యాంకింగ్‌ ఉపయోగించే పిన్‌టెక్‌ సంస్థలపై కూడ యస్‌ బ్యాంక్‌ ప్రభావం పడింది. 



You may be interested

యస్‌ బ్యాంక్‌లో ఇరుక్కున్న చిన్న ఇన్వెస్టర్లు

Friday 6th March 2020

డిసెంబర్‌ త్రైమాసికానికల్లా 48 శాతానికి రిటైల్‌ వాటా 2018 జూన్‌ త్రైమాసికంలో ఈ వాటా 8.8 శాతమే సుజ్లాన్‌ ఎనర్జీ, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఆర్‌కామ్‌ తరహాలోనే.. వేల్యూ బయింగ్‌ పేరుతో యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో పెట్టుబడులకు దిగుతూ వచ్చిన రిటైల్‌ ఇన్వెస్టర్లు చివరికి బిక్కమొహం వేయవలసిన పరిస్థితులు తలెత్తినట్లు మార్కెట్‌ విశ్లేషకులు తాజాగా వ్యాఖ్యానిస్తు‍న్నారు. ఒకప్పుడు మార్కెట్‌ ఫేవరెట్‌గా నిలవడంతోపాటు ఏకంగా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీలో భాగమైన యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ గత

యస్‌బ్యాంక్‌లో పెట్టుబడులు వున్న ఫండ్స్‌ ఇవే..!

Friday 6th March 2020

యస్‌ బ్యాంకులో భారీగా వాటాలు కలిగిన మ్యూచువల్‌ ఫండ్‌లకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన యస్‌బ్యాంక్‌పై 30రోజుల పాటు మారిటోరియం విధిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో ఈ బ్యాంక్‌ షేరు శుక్రవారం తీవ్ర పతనాన్ని చవిచూసింది. ఒకదశలో షేరు 85శాతం నష్టాన్ని చవిచూసి రూ.5.55 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. తద్వారా యస్‌బ్యాంక్‌ తన జీవితకాలంలోనే అతిపెద్ద నష్టాన్ని చవిచూసినట్లైంది.  అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం...

Most from this category