News


యస్‌బ్యాంక్‌.. రూ.47వరకు పడే ఛాన్స్‌?!

Thursday 22nd August 2019
news_main1566466984.png-27952

టెక్నికల్‌ అనలిస్టుల అంచనా


గురువారం ట్రేడింగ్‌లో యస్‌బ్యాంక్‌ షేరు దాదాపు 8 శాతం పతనమయ్యాయి. దీంతో షేరు 2014 మార్చి తర్వాత కనిష్ఠాలకు వచ్చింది. ఇప్పటి పతనం అనంతరం షేరు కోలుకుంటుందని కొనుగోలు చేయాలనుకునే ఇన్వెస్టర్లు కొంత కాలం ఆగడం మంచిదని టెక్నికల్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు. షేరులో పతనం మరో లెగ్‌ ఆరంభమైందని, అందువల్ల షేరు మరో 20- 23 శాతం క్షీణించవచ్చని అంచనా వేస్తున్నారు. టెక్నికల్‌ చార్టులు పరిశీలిస్తే షేరు రూ. 47 వరకు పడవచ్చని చెబుతున్నారు. ఈ స్థాయి వేవ్‌ థియరీలో మూడో వేవ్‌కు 23.6 శాతం ఫిబొనాక్కి స్థాయి అని, గతేడాది అంచనా వేసిన డౌన్‌ట్రెండ్‌కు వంద శాతం టార్గెటని వివరిస్తున్నారు. షేరు తన కీలక మద్దతు రూ. 70ని కోల్పోవడంతో మరో లెగ్‌ కరెక‌్షన్‌కు మార్గం సిద్ధమైందన్నారు. ఈ దశలో రూ. 53, రూ. 47 వరకు పతనం ఉండొచ్చని అంచనా వేశారు. ట్రెండ్‌ ఇంటెన్సిటీ ఇండికేటర్‌ 26 స్థాయికి రావడం డౌన్‌ట్రెండ్‌ను నిర్ధారిస్తోంది. అదేవిధంగా ఎంఏసీడీ తన సిగ్నల్‌ లైన్‌కు దిగువన బేరిష్‌ సంకేతాలు ఇస్తోంది. వేవ్‌ ప్యాట్రన్‌ సైతం షేరు కరెక‌్షన్‌ చివరి వేవ్‌లో ఉందని, ఇది పూర్తయితే కానీ(రూ. 47 వద్ద) అప్‌ట్రెండ్‌ ఆరంభమవదని టెక్నికల్‌ నిపుణుల అంచనా. 



You may be interested

సెన్సెక్స్‌ 587 పాయింట్లు, నిఫ్టీ 181 పాయింట్లు క్రాష్‌

Thursday 22nd August 2019

సెన్సెక్స్‌ నష్టం  587 పాయింట్ల 10750 దిగువకు ముగిసిన నిఫ్టీ  జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితులు దేశీయ మార్కెట్‌ను మరోసారి భారీగా దెబ్బతీసాయి. ఆర్థిక వృద్ధి మందగమనానికి ఉద్దీపన చర్యలేవి ఉండవని కేంద్రం నుంచి స్పష్టత రావడం, డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది కనిష్టానికి పతనం కావడం, క్యూ1లో దేశీయ నికర అమ్మకాల వృద్ధి క్షీణించడం, రేపు  జాక్సన్‌ హోల్‌ వేదికగా ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగం

ప్రధాన ఆర్థిక ఉద్దీపన వుండదు: ఎకనామిక్‌ అడ్వజర్‌

Thursday 22nd August 2019

ఆర్థిక వ్యవస్థ కోసం, ప్రభుత్వం ప్రధాన ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించే అవకాశాన్ని ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ గురువారం తోసిపుచ్చారు. ‘లాభం ప్రైవేట్, నష్టాలు పబ్లిక్’ అనే సిద్థాంతం ఆర్థికవ్యవస్థకు మంచిది కాదని ఆయన అన్నారు. పరిశ్రమలకు సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి దశలు సాధారణమని, సూర్యాస్తమయ దశలలో పరిశ్రమలకు, ప్రభుత్వం సహకరిస్తుందని ఆశించడం నైతికంగా ప్రమాదకరమని వివరించారు. హీరో మైండ్‌మైన్ సమ్మిట్ 2019 లో మాట్లాడుతూ.. దేశ

Most from this category