News


యస్‌బ్యాంక్‌ స్థానంలోకి శ్రీ సిమెంట్‌..?

Monday 3rd February 2020
news_main1580726920.png-31475


నిఫ్టీ 50 నుంచి యస్‌ బ్యాంక్‌ తన స్థానాన్ని కోల్పోనుంది. 2020 మార్చి 31 నుంచి యస్‌బ్యాంక్‌ స్థానంలో శ్రీ సిమెంట్‌ రానుందని ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్‌ అండ్‌ సెక్యూరిటిస్‌ అంచనా వేసింది. నిఫ్టీ50 తరువాతి సమీక్షలో శ్రీ సిమెంట్‌ నిఫ్టీ ఇండెక్స్‌లోకి వస్తుందని, ఎన్‌ఎస్‌ఈ ప్రమాణాలకు లోబడే యస్‌ బ్యాంక్‌ స్థానంలో శ్రీ సిమెంట్‌ వస్తుందని  తెలిపింది. కాగా ఏడాదికి రెండు సార్లు నిఫ్టీ50 సమీక్షలు జరుగుతాయి. ఆరు నెలలకొకసారి డేటాను  సమిక్షిస్తారు. కాగా నిఫ్టీ50 ఇండెక్స్‌లో  ప్రత్యేకంగా ఎంపిక చేసిన 50 కంపెనీలు ఉంటాయి.
 



You may be interested

ఈ ఇండెక్స్‌ స్టాక్స్‌ రేటింగ్‌లో మార్పులు

Monday 3rd February 2020

ఇండెక్స్‌ స్టాక్స్‌ అయిన ఐటీసీ, మారుతి సుజుకీ, ఐవోసీ, ఎస్‌బీఐ రేటింగ్‌లను అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు సవరించాయి.   ఐటీసీ ఐటీసీ స్టాక్‌కు ఇప్పటి వరకు కొనసాగించిన ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను జేపీ మోర్గాన్‌ తాజాగా న్యూట్రల్‌కు తగ్గించింది. టార్గెట్‌ ధరగా రూ.235ను పేర్కొంది. సిగరెట్లపై తాజా బడ్జెట్‌లో పన్నును పెంచేయడంతో స్టాక్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. బడ్జెట్‌లో పన్నుల పెంపు ఐటీసీ సిగరెట్ల అమ్మకాలపై ప్రభావం చూపుతుందని జేపీ మోర్గాన్‌ తెలిపింది. రానున్న 6-12

డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ పెంపుతో బ్యాంకులకు భారం!

Monday 3rd February 2020

తమ ప్రీమియం తగ్గించాలంటున్న కమర్షియల్‌ బ్యాంకులు బడ్జెట్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కవరేజ్‌ను పెంచడం బ్యాంకుల ఆపరేటింగ్‌ వ్యయాలను పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. డీఐసీజీసీ(డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌) ద్వారా అందిచే కవర్‌ గ్యారెంటీని లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో డిపాజిట్ల బీమాకు చెల్లించే ప్రీమియంలపై మదింపు జరపాలని బ్యాంకులు ఆశిస్తున్నాయి. తమ వద్ద ఉన్న మొత్తం అసెసబుల్‌

Most from this category