News


రూ. 10వేల కోట్ల సమీకరణకు లైన్ క్లియర్‌

Monday 10th February 2020
news_main1581305433.png-31638

(అప్‌డేటెడ్‌..)

  • యస్ బ్యాంక్‌ ఈజీఎంలో షేర్‌హోల్డర్ల ఆమోదం

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్ తాజాగా రూ. 10,000 కోట్ల నిధులు సమీకరించేందుకు, అధీకృత షేర్ క్యాపిటల్‌ను రూ. 800 కోట్ల నుంచి రూ. 1,100 కోట్లకు పెంచుకునేందుకు మార్గం సుగమమైంది. బ్యాంక్ అసాధారణ సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనల ప్రకారం రూ. 2 ముఖవిలువ గల 450 కోట్ల ఈక్విటీ షేర్లతో రూ. 900 కోట్ల మేర, ఒక్కోటి రూ. 100 చొప్పున రెండు కోట్ల ప్రిఫరెన్స్ షేర్లతో రూ. 200 కోట్ల మేర బ్యాంక్ తన అధీకృత షేర్‌ క్యాపిటల్‌ను పెంచుకోనుంది. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) లేదా ఇతరత్రా షేర్ల ప్రైవేట్ ప్లేస్‌మెంట్ లేదా రుణ రూపంలో ఒకేసారి లేదా విడతలవారీగా యస్ బ్యా్ంక్ రూ. 10,000 కోట్లు సమీకరించుకోనుంది. నిధుల సమీకరణ ప్రయత్నాల్లో ఉన్న యస్‌ బ్యాంక్‌లో కెనడా వ్యాపారవేత్త ఎర్విన్ సింగ్ బ్రెయిచ్‌ 1.2 బిలియన్ డాలర్లు, లండన్ సంస్థ సైటాక్స్ హోల్డింగ్స్ 500 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వీరితో పాటు జీఎంఆర్‌ గ్రూప్ 50 మిలియన్ డాలర్లు, ప్రముఖ ఇన్వెస్టరు రాకేష్ ఝన్‌ఝున్‌వాలా 25 మిలియన్ డాలర్లు, ఆదిత్య బిర్లా ఫ్యామిలీ ఆఫీస్ 25 మిలియన్ డాలర్లు పెట్టుబడి ప్రతిపాదనలు చేశాయి. అయితే, బ్రెయిచ్ పెట్టుబడి ప్రతిపాదనను యస్ బ్యాంక్ తిరస్కరించింది. 



You may be interested

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌

Monday 10th February 2020

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సూచీలను దెబ్బతీసిన మెటల్‌ షేర్ల పతనం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 50 పాయింట్ల నష్టంతో 41091.85 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 12083.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లకు తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లు అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. మెటల్‌ షేర్లు అత్యధికంగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ

సెయిల్‌లో 5 శాతం వాటా విక్రయం !

Monday 10th February 2020

ఓఎఫ్‌ఎస్‌ మార్గంలో విక్రయించనున్న కేంద్రం  రూ.1,000 కోట్లు సమీకరణ  న్యూఢిల్లీ: సెయిల్‌(స్టీల్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా)లో 5 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ఈ వాటా షేర్లను విక్రయించాలనేది ప్రభుత్వ భావన. ఈ వాటా విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1,000 కోట్లు సమకూరుతాయని అంచనా. ఈ వాటా విక్రయానికి సంబంధించిన రోడ్‌షోలను సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌ల్లో నిర్వహించాలని దీపమ్‌, ఉక్కు శాఖలు ప్రణాళికలు

Most from this category