News


రూ.1100 కోట్లకు ఆధీకృత మూలధనం: యస్‌బ్యాంక్‌ షేర్‌హోల్డర్ల ఆమోదం

Saturday 8th February 2020
news_main1581143996.png-31625

ప్రైవేట్ రంగానికి చెందిన యస్‌బ్యాంక్‌ అధీకృత మూలధనాన్ని రూ .1,100 కోట్లకు పెంచుకోవడానికి షేర్‌ హోల్డర్లు ఆమోదం తెలిపారు. ఈ మేరకు బ్యాంక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. యస్‌ బ్యాంక్‌ శుక్రవారం ముంబైలో అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. బ్యాంక్‌ అధీకృత మూలధనాన్ని రూ .1,100 కోట్లకు పెంచుకోవడానికి షేర్‌ హోల్డర్లు ఆమోదం తెలిపారు. అలాగే ఈక్విటీ షేర్లు లేదా రూ .10,000 కోట్ల విలువైన కన్వర్టబుల్‌ సెక్యూరిటీల జారీ ద్వారా మూలధన సేకరణను అనుమతించే ప్రత్యేక తీర్మానాన్ని కూడా సమావేశంలో ఆమోదించారు. యస్‌ బ్యాంక్‌ తన వృద్ధి సాధనకు నిధులు సేకరించాలని ప్రయత్నిస్తోంది. యస్‌బ్యాంక్‌ 2మిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణకు సిద్ధమైనట్లు ఈ వారం ప్రారంభంలో వార్తలు వెలుగులోకి వచ్చాయి. డాయిష్‌ బ్యాంక్ గ్లోబల్ కో-సిఇఓ అన్షు జైన్ నేతృత్వంలోని కాంటర్ ఫిట్జ్‌గెరాల్డ్, స్థానిక ఇన్వెస్టమెంట్‌ బ్యాంకులు ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్, అంబిట్ క్యాపిటల్‌లు నిధుల సమీకరణకు సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.
 



You may be interested

ఈ ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఆకర్షణీయం

Saturday 8th February 2020

జాబితాలో డీమార్ట్‌, టాటా గ్లోబల్‌ డాబర్‌ ఇండియా, బాటా ఇండియా జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ గత వారాంతాన విడుదలైన కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నాలుగు రోజుల్లో రికవరీ సాధించాయని రితేష్‌ ఆషెర్‌, చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌, కిఫ్స్‌ ట్రేడ్‌ కేపిటల్‌ పేర్కొన్నారు. ఇకపై మార్కెట్ల ట్రెండ్‌ ఎలా ఉండనుందన్న అంచనాలతోపాటు.. ఎఫ్‌ంఎసీజీ రంగంపై బడ్జెట్‌ సానుకూల ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. ఇంకా పలు ఇతర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో రితేష్‌ వ్యక్తం

నెలరోజులకు 5 స్టాక్‌ రికమెండేషన్లు

Saturday 8th February 2020

కేంద్రం 2020-21 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, ఆర్‌బీఐ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు చివరి ద్రవ్యపాలసీ సమీక్ష నిర్ణయాలు వెల్లడించిన నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లో కొంత అనిశ్చితి వాతావరణ నెలకొంది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 41వేల రేంజ్‌లో, నిఫ్టీ 12100 స్థాయిలో కదలాడుతున్నాయి. ఈ తరుణంలో నోమురా, నిర్మల్‌ బంగ్‌ బ్రోకరేజ్‌ సంస్థలు 5 షేర్లపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి.  స్టాక్‌ పేరు:- సన్‌ఫార్మా రేటింగ్‌:- కొనవచ్చు బ్రోకరేజ్‌ సంస్థ:- నోమురా పస్తుత ధర:-

Most from this category