News


యస్‌బ్యాంక్‌కు రూ. 8400 కోట్ల ఆఫర్‌...షేరు 35 శాతం జంప్‌

Thursday 31st October 2019
news_main1572511071.png-29261

35 శాతం దూసుకుపోయిన షేరు
ఒక అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ నుంచి వాటా కొనుగోలుకు సంబంధించి బైండింగ్‌ ఆఫర్‌ పొందామని యస్‌బ్యాంక్‌ ప్రకటించింది. తాజాగా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ నుంచి 120 కోట్ల డాలర్ల(సుమారు రూ.8400 కోట్లు) పెట్టుబడులు పొందేందుకు బైండింగ్‌ ఆఫర్‌ సాధించామని వెల్లడించింది. సదరు గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ పేరును బ్యాంకు బహిర్గతం చేయలేదు. అయితే హాంకాంగ్‌కు చెందిన ఎస్‌పీజీపీ హోల్డింగ్స్‌ సంస్థే ఈ ఇన్వెస్టరని, ఈ సంస్థే బ్యాంకులో 120 కోట్ల డాలర్ల పెట్టుబడులకు రెడీగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పెట్టుబడులతో పాటు మరిన్ని పెట్టుబడుల కోసం దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చలు కొనసాగిస్తూనే ఉన్నామని యస్‌బ్యాంక్‌ తెలిపింది. వచ్చేనెల 1న బ్యాంకు క్యు2 ఫలితాలు ప్రకటించనుంది. ఈ సందర్భంగా ఈ ఆఫర్‌తో పాటు ఇతర ఆఫర్లను కూడా బోర్డు పరిశీలించనుంది.

పెట్టుబడి వార్తలతో బ్యాంకు షేరు గురువారం ఇంట్రాడేలో దాదాపు 35 శాతం పెరిగి రూ. 78.70 వరకు  దూసుకుపోయింది. దీంతో షేరు తన ఏడాది కనిష్ఠస్థాయి నుంచి దాదాపు 150 శాతం రికవరీ చెందినట్లయింది. రెండు స్టాక్‌ ఎక్చేంజ్‌ల్లో కలిపి దాదాపు రూ.700 కోట్ల లావాదేవీలు జరిగాయి. కొన్నాళ్లుగా లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొంటున్న బ్యాంకు షేరు మూలధన సమీకరణకు మార్గాలు అన్వేషిస్తూ వస్తోంది. ఈ దిశలో పలు విదేశీ, స్వదేశీ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాయని తెలిపింది. ఈనెల మొదట్లో మైక్రోసాఫ్ట్‌ సంస్థ యస్‌బ్యాంకులో పెట్టుబడులు పెట్టనుందన్న వార్తలు వచ్చాయి. కానీ బ్యాంకు వీటిని ఖండించింది. 



You may be interested

బజాజ్‌ షేర్లు బంగారమే!

Thursday 31st October 2019

అదానీ, అంబానీ, టాటా, బిర్లా గ్రూప్‌ స్టాక్స్‌ కన్నా స్పీడ్‌ రాబడులు గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ హైని అందుకుంది. ఈ సందర్భంగా 2019 తొలి పదినెలల్లో ఇన్వెస్టర్ల సంపదను పెంచిన షేర్లు, సంపద ధ్వంసం చేసిన షేర్లు పరిశీలిస్తే మొదటి కేటగిరీలో బజాజ్‌గ్రూప్‌ షేర్లు, రెండో గ్రూప్‌లో అడాగ్‌ షేర్లు నిలిచాయి. 2019 అక్టోబర్‌ వరకు చూస్తే బజాజ్‌ గ్రూప్‌ షేర్లు అత్యంత వేగవంతమైన రాబడినిచ్చిన షేర్లుగా నిలిచాయి. అత్యంత స్పీడుగా

విదేశీ బ్రోకరేజిలు టార్గెట్‌ పెంచిన షేర్లివే!

Thursday 31st October 2019

సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి చాలా కంపెనీలు వాటి ఫలితాలను ప్రకటించాయి. ఫలితాలను ప్రకటించిన తర్వాత చాలా కంపెనీ టార్గెట్‌ ధరలను విదేశీ బ్రోకరేజిలు పెంచాయి.       టాప్‌ విదేశీ బ్రోకరేజిలు  టార్గెట్‌ ధరను పెంచిన టాప్‌ స్టాకులు: బ్రోకరేజి: సిటీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1,400 నుంచి 1,520 కు పెంచింది సెప్టెంబర్‌ త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 26.75 శాతం పెరిగి రూ. 6,345

Most from this category