News


యస్‌ బ్యాంకులో పరిస్థితులు బాలేవు

Saturday 11th January 2020
news_main1578713224.png-30845

  • స్వతంత్ర డైరెక్టరు ప్రకాశ్‌ అగర్వాల్‌ అభ్యంతరాలు
  • కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సరిగా లేదంటూ రాజీనామా
  • నిర్వహణలో జోక్యం చేసుకోవాలంటూ సెబీకి లేఖ


న్యూఢిల్లీ: యస్‌ బ్యాంకులో పద్ధతులు, వ్యవహారాలు దిగజారిపోతున్నాయంటూ స్వతంత్ర డైరెక్టర్‌ ఉత్తమ్‌ ప్రకాష్‌ అగర్వాల్‌ బాంబు పేల్చారు. ఈ విషయమై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తన పదవికి శుక్రవారం రాజీనామా సమర్పించారు. ‘‘యస్‌ బ్యాంకు ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌, ఆడిట్‌ కమిటీ చైర్మన్‌ పదవులతో పాటు, బోర్డుకు సంబంధించిన అన్ని కమిటీల్లో సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నా’’ అంటూ బ్యాంకు తాత్కాలిక చైర్మన్‌ బ్రహ్మ్‌దత్‌ను ఉద్దేశించి రాసిన లేఖలో అగర్వాల్‌ పేర్కొన్నారు. కార్పొరేట్‌ పాలనా ప్రమాణాలు క్షీణిస్తున్నాయని, నిబంధనల అమలులో వైఫల్యం, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలు.. ముఖ్యంగా బ్యాంకు ఎండీ, సీఈవో రవనీత్‌ గిల్‌, సీనియర్‌ గ్రూపు ప్రెసిడెంట్‌ రాజీవ్‌ ఉబోయ్‌, లీగల్‌ హెడ్‌ సంజయ్‌ నంబియార్‌ బ్యాంకును నిర్వహిస్తున్న తీరు పట్ల ఆయన తన లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘యస్‌ బ్యాంకు, లక్షలాది డిపాజిటర్లు, వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ కీలక అంశాల పట్ల ఎప్పటికప్పుడు ఆందోళనలు వ్యక్తం చేశాను. నా విధుల నిర్వహణలో వీటి పరిష్కారానికి శాయశక్తులా ప్రయత్నించా. నా రాజీనామాతో సంబంధం లేకుండా, బ్యాంకు కుదుటపడి, భాగస్వాములు, వాటాదారుల ప్రయోజనాలను మీ నాయకత్వంలో కాపాడుతుందని ఆశిస్తున్నాను’’ అని అగర్వాల్‌ పేర్కొన్నారు. 
తక్షణం జోక్యం చేసుకోవాలి...
ఇవే అంశాలపై సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగికి ఈ నెల 9న అగర్వాల్‌ ఓ లేఖ రాశారు. తక్షణమే సెబీ జోక్యం చేసుకోవాలని కోరారు. బ్యాంకు సీఈవో, ఎండీ రవనీత్‌ గిల్‌ గతేడాది అక్టోబర్‌ 31న బ్యాంకు 1.2 బిలియన్‌ పెట్టుబడుల ఆఫర్‌ను అందుకుందని మౌఖింగా చెప్పినట్టు లేఖలో పేర్కొన్నారు. ‘‘ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు డైరెక్టర్ల బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే, ఎండీ, సీఈవో ఆయనకు తెలిసిన కారణాల వల్ల ఇన్వెస్టర్‌ పేరును బయటకు వెల్లడించకూడదని నిర్ణయించుకున్నారు. అక్టోబర్‌ 31న మీడియాకు విడుదల చేసినట్టుగానే బైండింగ్‌ ఆఫర్‌ ప్రతిపాదనను టేబుల్‌పై ఉంచారు. దీంతో కొందరు వ్యక్తులు అనుచిత పద్ధతుల్లో తప్పుదోవ పట్టించే సమాచారంతో పెట్టుబడిదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేయడం ద్వారా లబ్ధి పొందే అవకాశం కల్పించినట్టు అయింది’’ అని అగర్వాల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. You may be interested

పరిశ్రమలు మళ్లీ ప్లస్‌లోకి...

Saturday 11th January 2020

నవంబర్‌లో 1.8 శాతం వృద్ధి మూడు నెలల తర్వాత  క్షీణత నుంచి బయటకు.. ‘తయారీ’ రంగం రికవరీ న్యూఢిల్లీ: భారత్‌ పారిశ్రామిక రంగం నవంబర్‌లో వెలుగురేఖలు చూసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 1.8 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. భారత్‌ పారిశ్రామిక రంగం మూడు నెలల తర్వాత వృద్ధిబాటలోకి రావడం గమనార్హం. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లలో భారత్‌ పారిశ్రామిక రంగంలో అసలు వృద్ధినమోదుకాకపోగా, క్షీణ రేటు నెలకొంది. మొత్తం సూచీలో మెజారిటీ వాటా ఉన్న తయారీ

సంక్రాంతి ఆఫర్లకు విశేష స్పందన: ‘బిగ్‌ సి’

Saturday 11th January 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సంక్రాంతి ఆఫర్లకు విశేష స్పందన లభిస్తున్నట్లు మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌ సి’ వెల్లడించింది. ఆఫర్స్‌లో భాగంగా రూ.12 కోట్ల విలువైన బహుమతులతో పాటు రూ.5 కోట్ల విలువైన క్యాష్‌ పాయింట్లను కూడా అందిస్తున్నట్టు బిగ్‌ సి ఫౌండర్‌ ఎం.బాలు చౌదరి తెలిపారు. మైక్రోమ్యాక్స్‌ ఐ వన్‌ (2జీబీ) మరియు రూ.13,990 విలువగల హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని రూ.8,999కి... రూ.11,990 విలువగల లెనోవో

Most from this category