News


యస్‌ బ్యాంక్‌ చీఫ్‌ రేసులో 10 మంది బ్యాంకర్లు..

Saturday 17th November 2018
news_main1542433100.png-22131

ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ కొత్త సీఈవో పదవి రేసులో దాదాపు 5-10 మంది బ్యాంకర్లున్నట్లు తెలుస్తోంది. సీఈవో ఎంపిక కోసం ఏర్పాటైన సెర్చి కమిటీ షార్ట్‌ లిస్ట్ చేసిన వారిలో ఒక విదేశీ బ్యాంక్‌ (ఎంఎన్‌సీ) చీఫ్‌తో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అధిపతి, మరికొన్ని ప్రైవేట్ బ్యాంకుల హెడ్స్  ఉన్నట్లు సమాచారం. లిస్టులో 5-10 మంది బ్యాంకర్ల పేర్లున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అంతిమంగా షార్ట్‌లిస్ట్‌లో అయిదుగురే ఉంటారని పేర్కొన్నాయి. వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో రాణా కపూర్ స్థానంలో కొత్త సీఈవో పేరును.. డిసెంబర్‌ మూడో వారంనాటికే ఖరారు చేసే అవకాశం ఉందని వివరించాయి. రిజర్వ్ బ్యాంక్ ఇందుకు జనవరి 31దాకా గడువిచ్చింది. 
బయటి వారినే కాకుండా యస్‌ బ్యాంక్‌లో అంతర్గతంగా సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్స్ అయిన రజత్ మోంగా, ప్రళయ్ మండల్ పేర్లను కూడా సెర్చి కమిటీ పరిగణనలోకి తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. వీరినింకా ఇంటర్వ్యూ చేయలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సెర్చి కమిటీ నుంచి ఎస్‌బీఐ మాజీ చీఫ్ ఓపీ భట్‌ తప్పుకోవడంపై వివరణనిచ్చాయి. లిస్టులోని ఓ బ్యాంకరుకు చెందిన విదేశీ బ్యాంకుకు భట్ గతంలో సలహాదారుగా సేవలందించారని తెలిపాయి. దీంతో సీఈవో ఎంపిక నిర్ణయంపై తన ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో సెర్చి కమిటీ నుంచి భట్ తప్పుకున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. కాంపిటీషన్ కమిషన్ మాజీ చైర్మన్ అశోక్‌ చావ్లా, ఓపీ భట్‌ల నిష్క్రమణతో సెర్చి కమిటీలో ఒక్కరు మాత్రమే బయటి సభ్యుడు (బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ చీఫ్ టీఎస్‌ విజయన్‌) మిగిలారని సంబంధిత వర్గాలు వివరించాయి. You may be interested

ఆర్థిక విధానాలపై అర్థవంతమైన చర్చ అవసరం: జైట్లీ

Saturday 17th November 2018

ముంబై: నినాదాలు, ప్రజాకర్షణలు ఆర్థిక విధానాలను నడిపించలేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఆర్థిక విధానాలపై వాస్తవాలు, పూర్తి సమాచారం ఆధారంగా తగిన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మనీకంట్రోల్‌ సంస్థ నిర్వహించిన వెల్త్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ మాట్లాడారు. దేశంలో నాణ్యమైన చర్చలు కొరవడ్డాయన్న ఆయన, ముఖ్యంగా ఆర్థిక అంశాలపై ఆరోగ్యకరమైన చర్చ జరిగేలా జాతీయ స్థాయిలో ప్రయత్నం జరగాలన్నారు. కేవలం ప్రకటనలపైనే

‘అటల్‌ పెన్షన్‌’ను ప్రభుత్వ పథకం మాదిరే చూడాలి

Saturday 17th November 2018

న్యూఢిల్లీ: అటల్‌ పెన్షన్‌ యోజనను ఇతర ప్రభుత్వ ప్రయోజన పథకాల్లానే చూడాలని, ఆధార్‌తో అనుసంధానానికి అవకాశం కల్పించాలని యూఐడీఏఐని చైర్మన్‌ హేమంత్‌ జి కాంట్రాక్టర్‌ కోరారు. అటల్‌ పెన్షన్‌ పథకానికి ప్రభుత్వ హామీ ఉందని, ప్రభుత్వ ప్రయోజనమనే అర్థం పరిధిలోకి వస్తుందని చెప్పారాయన. ఆధార్‌ వినియోగం విషయమై సుప్రీంకోర్టు అన్ని ప్రభుత్వ పథకాలకు మినహాయింపు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

Most from this category