2 బిలియన్ డాలర్ల సమీకరణలో యస్ బ్యాంక్
By Sakshi

(అప్డేట్) ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా 2 బిలియన్ డాలర్లు సమీకరిస్తోంది. షేర్ల ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ప్రాతిపదికన ఇన్వెస్ట్ చేసేందుకు పలు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు బ్యాంకు వెల్లడించింది. శుక్రవారం బోర్డు సమావేశం అనంతరం స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎర్విన్ సింగ్ బ్రెయిచ్/ఎస్పీజీపీ హోల్డింగ్స్ (ఇంకా చర్చలు జరుగుతున్నాయి) 1,200 మిలియన్ డాలర్లు, అమెరికాకు చెందిన ఒక ఫండ్ సంస్థ 120 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చాయి. ఇతరత్రా కార్పొరేట్ల కుటుంబ కార్యాలయాలకు సంబంధించి సిటాక్స్ హోల్డింగ్స్ ఫ్యామిలీ ఆఫీస్ 500 మిలియన్ డాలర్లు, జీఎంఆర్ గ్రూప్ అండ్ అసోసియేట్స్ 50 మిలియన్ డాలర్లు, ఆదిత్య బిర్లా ఫ్యామిలీ ఆఫీస్ 25 మిలియన్ డాలర్లు, ప్రముఖ ఇన్వెస్టరు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా 25 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు చేశారు. 2 వారాలు లేదా 26 వారాల స్టాక్ సగటు ధర (ఏది ఎక్కువైతే అది) ప్రాతిపదికన షేర్ల కేటాయింపు ఉండనుంది. దీనిపై డిసెంబర్ 10న యస్ బ్యాంక్ బోర్డు మరోసారి సమావేశం కానుంది.
You may be interested
టాప్-10లో ముకేశ్ అంబానీ
Saturday 30th November 2019రూ. 4.3 లక్షల కోట్ల సంపదతో 9వ స్థానం ఫోర్బ్స్ కుబేరుల్లో నెంబర్-1 జెఫ్ బెజోస్ న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 60 బిలియన్ డాలర్లు (రూ. 4.3 లక్షల కోట్లు) అని ‘రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్’ పేరిట విడుదల చేసిన జాబితాలో ఫోర్బ్స్
నిఫ్టీ చార్టుల్లో బేరిష్బెల్ట్ హోల్డ్ ప్యాట్రన్
Saturday 30th November 2019నిఫ్టీ శుక్రవారం దాదాపు వంద పాయింట్లు నష్టపోయి 12050 పాయింట్ల స్థాయి వద్ద ముగిసింది. డైలీ చార్టుల్లో నిఫ్టీలో బేరిష్బెల్ట్ హోల్డ్ ప్యాట్రన్ ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్రాడేలో నిఫ్టీ తన తక్షణ మద్దతు 10990 పాయింట్లను కాపాడుకుంది, కానీ స్వల్పకాలిక మూవింగ్ యావరేజ్ స్ధాయి దిగువన ముగిసి బలహీనత సూచిస్తోంది. అయితే వీక్లీ చార్టుల్లో మాత్రం నిఫ్టీ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడింది. కానీ మొత్తం మీద బుల్లిష్ ట్రెండ్‌లో