News


విమానాశ్రయాల కోసం ఏటా 5,000 కోట్లు

Saturday 14th March 2020
news_main1584178024.png-32484

  • ఏఏఐ చైర్మన్‌ అరవింద్‌ సింగ్‌

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఏటా సగటున రూ.3,000-4,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది నుంచి రూ.5,000 కోట్లు వ్యయం చేయనున్నట్టు ఏఏఐ చైర్మన్‌ అరవింద్‌ సింగ్‌ వెల్లడించారు. వింగ్స్‌ ఇండియా ప్రదర్శన, సదస్సులో శుక్రవారం పాల్గొన్న ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘వచ్చే అయిదేళ్లు రూ.25,000 కోట్లు ఖర్చు చేయనున్నాం. ఎక్స్‌టర్నల్‌ కమర్షియల్‌ బారోయింగ్‌ విధానంలో వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.2,220 కోట్లు సమీకరించనున్నాం. ఉడాన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.4,500 కోట్లు కేటాయించింది. దేశంలో 110 విమానాశ్రయాలకుగాను ఏఏఐ కింద 90కి పైగా ఉన్నాయి. చిన్న, కార్యకలాపాలు లేని విమానాశ్రయాలను ఉడాన్‌ కింద అభివృద్ధి చేస్తున్నాం. ఇలా 48 విమానాశ్రయాలను మూడేళ్లలో కార్యరూపంలోకి తెచ్చాం. ప్రస్తుతం ఏటా 34.5 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాం. పదేళ్లలో ఈ సంఖ్యను 75 కోట్లకు చేర్చనున్నాం. ఇందుకు అనుగుణంగా కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తాం. చిన్న విమానాశ్రయాల నుంచి ప్రయాణికుల సంఖ్య ఏటా 25 శాతం పెరుగుతోంది’ అని వివరించారు. 



You may be interested

1,400 డాలర్లు దిశగా పసిడి!

Saturday 14th March 2020

ఈ వారం మొదట్లో ఏడేళ్ల గరిష్టాని(1,703.90 డాలర్లు)కి చేరిన బంగారం ధర శుక్రవారం ఇంట్రాడేలో 1,504.35 డాలర్లకు పడిపోయింది. వచ్చేవారంలో మొదట్లోనే గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 1,400 డాలర్లకు చేరవచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, స్వీడన్‌, నార్వే వంటి దేశాలు  ఫైనాన్సియల్‌ మార్కెట్లను బలపరిచేందుకు ఉద్దీపనలు ప్రకటించాయి. దీంతో వచ్చేవారం బంగారం ధర 1,400 డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికా

ఎస్‌బీకార్డ్స్‌ లిస్టింగ్‌.. నష్టాలా లాభాలా?

Saturday 14th March 2020

గ్రే మార్కెట్‌ ఏం చెబుతోంది? ఈ నెల మొదట్లో రూ. 350-380 ప్రీమియం తదుపరి రూ.25-50కు దిగివచ్చిన ప్రీమియం శుక్రవారానికల్లా రూ. 25 డిస్కౌంట్‌లోకి కరోనా వైరస్‌ ధాటికి దేశీ స్టాక్‌ మార్కెట్లు కుదేలైన ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్‌బీఐ కార్డ్స్‌ లిస్టింగ్‌ ఎలా ఉండనుందన్న అంచనాలు ఇటీవల ఇన్వెస్టర్లను కుదిపివేస్తున్నాయి. రూ. 755 ధరలో వచ్చిన ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో సోమవారం(16న) లిస్ట్‌కానుంది. క్రెడిట్‌ కార్డ్స్‌ మారెట్లో రెండో పెద్ద కంపెనీగా నిలుస్తున్న

Most from this category