News


ఏటా అయిదు కొత్త ఉత్పత్తులు

Saturday 19th October 2019
news_main1571458671.png-28994

  • ఐఐఎల్‌ ఎండీ రాజేశ్‌ అగర్వాల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- అగ్రోకెమికల్స్‌ కంపెనీ ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా (ఐఐఎల్‌) ఏటా అయిదు కొత్త ఉత్పాదనలను తేనుంది. ప్రస్తుతం కంపెనీ 18 రకాల ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తోంది. వీటికి మూడు నాలుగు ఉత్పత్తులు ఈ ఏడాది జతకూడనున్నాయని ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా ఎండీ రాజేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. మిరపను నాశనం చేసే పురుగులను హరించే కునోయిచిని విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గతేడాది నూతన తరం ఉత్పత్తుల వాటా 45 శాతం. ఈ ఏడాది ఇది 50 శాతానికి చేరుకుంటుంది. గుజరాత్‌లో నెలకొల్పుతున్న ప్లాంటు మార్చికల్లా సిద్ధమవుతుంది. ఈ కేంద్రం పూర్తిగా ఎగుమతుల కోసం ఉద్ధేశించింది. టర్నోవరు 2019-20లో 8 శాతంపైగా వృద్ధి చెంది సుమారు రూ.1,300 కోట్లకు ఎగుస్తుందని ఆశిస్తున్నాం’ అని వివరించారు. జపాన్‌కు చెందిన నిస్సాన్‌ కెమికల్‌ తయారు చేసిన పేటెంటెడ్‌ ఉత్పదన కునోయిచిని భారత్‌లో ఐఐఎల్‌ మార్కెట్‌ చేస్తోంది. 



You may be interested

అంబుజా సిమెంట్స్‌ లాభం రూ.534 కోట్లు

Saturday 19th October 2019

45 శాతం వృద్ధి  రూ.6,190 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: అంబుజా సిమెం‍ట్స్‌ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్‌ 30తో ముగిసిన క్వార్టర్‌కు రూ.534 కోట్ల నికర లాభం సాధించింది. గత ఏడాది ఇదే ‍క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం రూ.396 కోట్లుతో పోల్చితే 35 శాతం వృద్ధి సాధించామని అంబుజా సిమెంట్స్‌ తెలిపింది. రవాణా వ్యయాలు తగ్గడం, ప్రీమియమ్‌ ఉత్పత్తుల జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని అంబుజా

పెద్ద సంస్థలకు డిజిటల్‌ చెల్లింపులపై ఇక చార్జీల్లేవు

Saturday 19th October 2019

న్యూఢిల్లీ: బ్యాంకులు లేదా సిస్టమ్‌ ప్రొవైడర్లు.. రూ.50 కోట్లకు పైగా టర్నోవర్‌ కలిగిన వ్యాపార సంస్థలకు డిజిటల్‌ రూపంలో చేసే చెల్లింపులపై అటు కస్టమర్ల నుంచి కానీ, ఇటు వర్తకుల నుంచి కానీ ఎటువంటి చార్జీలు లేదా మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును వసూలు చేయరాదంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. వార్షిక టర్నోవర్‌ రూ.50 కోట్లకు పైగా ఉన్న సంస్థలు తమ కస్టమర్లకు

Most from this category