News


ఉపకరణాలన్నిటా... ‘ఎంఐ’ ముద్ర!

Saturday 22nd December 2018
news_main1545450021.png-23148

న్యూఢిల్లీ: చేతిలో ఎంఐ ఫోన్‌... హాల్లో ఎంఐ ఫ్రిజ్‌... కిచెన్‌లో ఎంఐ వాటర్‌ ప్యూరిఫయర్‌... బాల్కనీలో ఎంఐ వాషింగ్‌ మెషిన్‌... బెడ్‌ రూమ్‌లో ఎంఐ ఏసీ... భవిష్యత్తులో ఇదే చూడబోతున్నాం!. చౌక ధరలకే అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎంఐ బ్రాండ్‌ స్మార్ట్‌ ఫోన్లతో భారతీయులకు చేరువైన చైనా కంపెనీ ‘షావోమీ’... భారత మార్కెట్లో మరింతగా పాతుకుపోయే ప్రణాళికలను రచిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ నుంచి పూర్తి స్థాయి కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థగా అవతరించనుంది. షావోమీ ఉన్నత స్థాయి ఉద్యోగ బృందం ప్రస్తుతం ఇదే పనిలో ఉంది. భారత మార్కెట్లో భారీ వృద్ధికి అవకాశం ఉన్న ఏసీలు, వాషింగ్‌ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, వ్యాక్యూమ్‌ క్లీనర్లు, వాటర్‌ ప్యూరిఫయర్ల విభాగాల్లో ఉత్పత్తులను తీసుకురావడంపై దృష్టి సారించినట్టు సమాచారం. అన్ని ఉత్పత్తులు కూడా ఇంటర్నెట్‌ ఆధారితంగా నియంత్రించేందుకు (ఐవోటీ) వీలుండే స్మార్ట్‌గానే ఉంటాయని, రిమోట్‌గా వీటిని నియంత్రించుకోవచ్చని కంపెనీ ఉద్యోగులు తెలిపారు.
వృద్ధి అవకాశాలు... 
భారత మార్కెట్లో షావోమీ ఏటా 100 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం ద్వారా మరింత వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోవాలన్నది కంపెనీ ఆలోచన. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో తీవ్ర పోటీ కారణంగా ఈ ఒక్క విభాగమే శాశ్వతం కాదనుకుని అదనపు వృద్ధి అవకాశాలపై కంపెనీ దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. నిజానికి షావోమీ ఇప్పటికే భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్లు, ఎయిర్‌ ప్యూరిఫయర్లు, టీవీలతోపాటు మరికొన్ని గ్యాడ్జెట్లను కూడా విక్రయిస్తోంది. స్మార్ట్‌ టెలివిజన్ల విభాగంలో వచ్చే ఏడాది మరిన్ని ఉత్పత్తులను తీసుకురానుంది. షావోమీ ప్రస్తుతం తన ఉత్పత్తులను తొలుత ఆన్‌లైన్‌లో విడుదల చేసి, తర్వాత ఎంఐ స్టోర్లలో అందుబాటులోకి తెస్తోంది. ఇకపై పెద్ద ఎలక్ట్రానిక్‌, మొబైల్‌ రిటైల్‌ స్టోర్లలోనూ తన ఉత్పత్తులను అందుబాటులోకి తేనుందని పరిశ్రమకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. 
ఆఫ్‌లైన్లో విస్తరణ
షావోమీ దేశవ్యాప్తంగా కొత్తగా 500 పట్టణాల్లోకి వచ్చే ఏడాది తన కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికతో ఉంది. ప్రస్తుతం కంపెనీ దేశంలోని టాప్‌ 50 పట్టణాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. షావోమీ ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ స్మార్ట్‌ టెలివిజన్‌ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ప్రధాన కంపెనీలైన శామ్‌సంగ్‌, సోనీ, ఎల్‌జీ ఉత్పత్తులతో పోలిస్తే 30-50 శాతం చౌక ధరలకే ఆఫర్‌ చేయడం ద్వారా వాటికి గట్టి సవాల్‌ విసిరింది. తొలుత ఆన్‌లైన్‌లో ఆరంభించిన విక్రయాలను తర్వాత ఎంఐ స్టోర్లకు విస్తరించింది. స్థానిక కంపెలతో తయారీ ఒప్పందాలను చేసుకుంది. ఇదే తరహాలో హోమ్‌ అప్లయన్సెస్‌ విభాగంలోనూ మరిని ఉత్పత్తులతో చొచ్చుకుపోవాలన్నది కంపెనీ వ్యూహం. ప్రధాన కంపెనీలకు దీటుగా ఫీచర్లు అన్నింటినీ ఇస్తూ, ధరల పరంగా చౌకగా అందుబాటులోకి తీసుకురావడం ఎంఐ విజయసూత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు త్వరలో ఎంఐ బ్రాండ్‌ నుంచి మరిన్ని ఇతర ఉత్పత్తులు తక్కువ ధరలకే అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. You may be interested

కొత్త టెక్నాలజీలతో బోలెడన్ని అవకాశాలు

Saturday 22nd December 2018

సాక్షి, హైదరాబాద్‌: మున్ముందు అన్ని రంగాల్లోనూ ఏఐ, ఐఓటీ వంటి డీప్‌ టెక్నాలజీస్‌ పాత్ర కీలకం కానుందని.. దీనికి ఆందోళన చెందకుండా అవకాశంగా మలచుకోవాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ – కోల్‌కత బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌ శ్రీకృష్ణ కులకర్ణి సూచించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం మొదలు ఐటీ వరకూ అన్నిటా ఏఐ, ఐఓటీల ప్రమేయంతో కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితి వస్తుందని, దీనికి సంస్థల యాజమాన్యాలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

గ్రాముకు రూ. 3,119 ధర..

Saturday 22nd December 2018

న్యూఢిల్లీ: కొత్తగా జారీ చేసే పసిడి బాండ్ల సిరీస్‌కు సంబంధించి గ్రాముకు రూ.3,119 ధరను కేంద్రం నిర్ణయించింది. 2018-19 సావరీన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్‌లో నాలుగో సిరీస్ కింద బాండ్ల జారీ డిసెంబర్ 24న ప్రారంభమై 28న ముగుస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి, డిజిటల్ విధానంలో చెల్లింపులు జరిపేవారికి ఇష్యూ ధరలో గ్రాముపై రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. ఈ కేటగిరీకి చెందిన వారికి గ్రాము

Most from this category