News


ఇక షావోమి... వ్యక్తిగత రుణాలు

Wednesday 4th December 2019
Markets_main1575431383.png-30040

  • యాప్‌ ఆధారంగా రుణాలు
  • ‘మీ క్రెడిట్‌’ పేరిట యాప్‌ విడుదల
  • రూ. లక్ష వరకు లోన్‌

న్యూఢిల్లీ: చైనాకు చెందిన షావోమీ.. భారత్‌లో రుణ మంజూరీ సేవలను ప్రారంభించింది. ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఇక్కడ మార్కెట్‌కు సుపరిచితమైన ఈ సంస్థ.. మొబైల్‌ అప్లికేషన్‌ ఆధారంగా వ్యక్తిగత రుణాలను ఇవ్వనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందుకోసం ‘మీ క్రెడిట్‌’ పేరిట యాప్‌ను అందుబాటులో ఉంచింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని రూ. లక్ష వరకు రుణం పొందవచ్చని వివరించింది. ఈ అంశంపై కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ మాట్లాడుతూ.. ‘ఆన్‌లైన్‌ ద్వారా వ్యక్తిగత రుణాలను అందించడానికి మీ క్రెడిట్ యాప్‌ను అధికారికంగా ప్రారంభించాం. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ సేవలు పైలెట్‌ పద్ధతిలో అందుబాటులో ఉన్నాయి. అత్యంత తక్కువ ప్రొసెసింగ్‌ సమయంతో రుణం పొందే విధంగా యాప్‌ను రూపొందించాం’ అని చెప్పారు. ప్రస్తుతం రుణ భాగస్వాముల జాబితాలో ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్, మనీ వ్యూ, ఎర్లీశాలరీ, జెస్ట్‌మనీ, క్రెడిట్‌విద్యా వంటి బ్యాంకింగేతర సంస్థలు ఉన్నట్లు వెల్లడించారు. వ్యక్తగత రుణ పద్దతిలో ఉన్న సవాళ్లను అధిగమిస్తూ.. డిజిటల్‌ పద్దతిలో రుణ మంజూరీ చేయనున్నామని వివరించిన ఆయన.. యువ నిపుణులు, మిలీనియల్స్ (1980– 2000 మధ్య జన్మించినవారు) తమ లక్ష్యమని చెప్పారు. వినియోగదారు డేటా సురక్షితంగా ఉండడం కోసం అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో షావోమీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. పైలెట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఏడాది నవంబర్‌లో రూ. 28 కోట్లను ఇప్పటికే మంజూరీ చేసింది. ఇందులో 20 శాతం మంది రూ. లక్ష రుణం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో 1,500 పిన్‌కోడ్‌లలో సేవలు అందుబాటులో ఉండగా.. 2018– 19 ఆర్థిక సంవత్సరం చివరినాటికి 100 శాతం పిన్‌కోడ్‌లలో సేవలు విస్తరించాలని భావిస్తోంది. ఇక షావోమీ ఫోన్‌ వినియోగదారులకు క్రెడిట్‌ స్కోర్‌ను ఉచితంగా అందిస్తోంది.

ఫైనాన్షియల్‌ సేవలపై దృష్టి...
భారత్‌లో ఇప్పటికే ‘మీ పే’ పేరిట యూపీఐ ఆధారిత పేమెంట్‌ యాప్‌ సేవలను అందిస్తోన్న ఈ సంస్థ.. రానున్నకాలంలో మరిన్ని ఫైనాన్షియల్‌ సేవలను ఇక్కడి మార్కెట్లో అందించనున్నట్లు ప్రకటించింది. తాజాగా అందుబాటులోకి తెచ్చిన ‘మీ క్రెడిట్‌’కు వచ్చే స్పందన ఆధారంగా విస్తృత సేవలను తీసుకుని రానున్నట్లు వివరించింది. ఇక 2023 నాటికి ఆన్‌లైన్‌ క్రెడిట్‌ వ్యాపారం రూ. 70 లక్షల కోట్లకు చేరుకోనుందని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం రూ. 4 లక్షల కోట్ల విలువైన వ్యక్తిగత రుణాలను 1.9 కోట్ల మంది కస్టమర్లు పొందారని, వీరి అవుట్‌స్టాండిగ్‌ అమౌంట్‌ రూ. 2 లక్షలుగా ఉన్నట్లు సిబిల్‌ రిపోర్ట్‌ ద్వారా వెల్లడైనట్లు షావోమీ వివరించింది. You may be interested

డిపాజిట్లపై బీమా పెంపు సమాచారం లేదు

Wednesday 4th December 2019

- ఆర్‌బీఐ అనుబంధ విభాగం డీఐసీజీసీ ప్రకటన  - ప్రస్తుతం రూ. లక్ష డిపాజిట్‌ వరకే బీమా రక్షణ - రూ.5 లక్షల చేయాలన్న డిమాండ్లు - పరిశీలనలో ఉందని ఇటీవల ఆర్థికమంత్రి ప్రకటన న్యూఢిల్లీ: బ్యాంక్‌ డిపాజిట్‌దారుడు ప్రస్తుతం రూ. లక్ష వరకూ మాత్రమే తన డిపాజిట్‌కు రక్షణ పొందగలుగుతాడు. ఇందులో ఎటువంటి మార్పూ లేదు.  బ్యాంక్‌లో వేసే డిపాజిట్లపై బీమా పెంపు సమాచారం ఏదీ తమకు లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)

రూ.4.91 లక్షల కోట్ల రుణ పంపిణీ

Wednesday 4th December 2019

అక్టోబర్‌, నవంబర్‌లలో ప్రభుత్వ బ్యాంకింగ్‌ గణాంకాలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు అక్టోబర్‌, నవంబర్‌లలో రూ.4.91 లక్షల కోట్ల రికార్డు స్థాయి రుణ పంపిణీలు జరిపాయి.  వినియోగం పెంపు, ఆర్థిక వృద్ధి పునరుత్తేజం లక్ష్యంగా రుణ వృద్ధి మెరుగుపడాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో ఈ గణాంకాలు వెలువడ్డాయి. బ్యాంకులు వినియోగదారులను చేరుకోవాలని, వారి అవసరాలకు అనుగుణంగా తగిన అన్ని నిబంధనలూ అనుసరించి రుణ పంపిణీలు జరగాలనీ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సెప్టెంబర్‌లో బ్యాంకులకు

Most from this category