News


3నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

Monday 15th April 2019
news_main1555313216.png-25137

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15:  ప్రైమరీ ఆర్టికల్స్‌, ఇంధన ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3నెలల గరిష్టానికి చేరుకుంది.  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం  మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 3.18శాతంగా నమోదదైంది. గతేడాది (2018) మార్చిలో ఇది 2.74శాతంగా ఉంది. అంతక్రితం నెల 2.93 శాతంగా నమోదైంది. వాహన ఇంధనం, ఎల్‌పీజీ ధరలు పెరగడంతో ఇంధన, విద్యుత్తు ద్రవ్యోల్బణం 5.41శాతానికి పెరిగింది. ఇది ఫిబ్రవరిలో 2.23శాతంగా మాత్రమే నమోదైంది. ఆహారోత్పత్తుల విభాగపు ద్రవ్యోల్బణం మార్చిలో 5.68 శాతానికి పెరిగింది. ఇది ఫిబ్రవరిలో 4.28శాతంగా నమోదైంది. అయితే  ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, వివిధ రకాలైన పండ్లు, పాలు తదితర ఆహారోత్పత్తుల ధర పెరుగుదల 1.30 శాతానికి పరిమితమైంది. రిటైల్‌ ధరల ద్రవ్యొల్బణం(సీపీఐ) 2.86 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. సాధారణంగా ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకునేప్పుడు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.



You may be interested

అరశాతం పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ

Monday 15th April 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంకు నిఫ్టీ సోమవారం అరశాతానికి పైగా ర్యాలీ చేసింది. నేడు బ్యాంకు నిఫ్టీ 29,983.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ప్రైవేట్‌ రంగ షేర్లైన కోటక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 1శాతం పెరిగాయి.  ఇండెక్స్‌లో వాటితో పాటు పీఎన్‌బీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఐడీఎఫ్‌సీఫస్ట్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం ర్యాలీ

టీసీఎస్‌? ఇన్ఫోసిస్‌?.. ఏది బెటర్‌?

Monday 15th April 2019

శుక్రవారం ఐటీ దిగ్గజాల ఫలితాలతో క్యు4 సీజన్‌ ఆరంభమైంది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ అంచనాల కన్నా మంచి ఫలితాలే ప్రకటించినా, మార్జిన్ల పరంగా టీసీఎస్‌ మెరుగ్గా కనిపించింది. ఈ నేపథ్యంలో రెండు కంపెనీల ఫలితాలు, షేరు భవితవ్యంపై బ్రోకరేజ్‌లు, నిపుణుల అంచనాలు ఇలా ఉన్నాయి... షేర్‌ఖాన్‌: రెండు కంపెనీల షేర్లకు కొనొచ్చు రేటింగ్‌. టీసీఎస్‌ టార్గెట్‌ రూ. 2400. ఇన్ఫోసిస్‌ టార్గెట్‌ రూ. 840. టీసీఎస్‌ ఫలితాలు ఇన్ఫీ కన్నా బాగున్నాయి. ఇన్ఫోసిస్‌

Most from this category