News


ఉల్లి, ఆలూ ధరలు ప్రియం

Saturday 15th February 2020
news_main1581736719.png-31808

  • టోకు ధరల సూచీపై ఆహార ధరల ఎఫెక్ట్‌
  • జనవరిలో డబ్ల్యూపీఐ 3.1 శాతం
  • మందగమనాన్ని సూచిస్తున్న తయారీ
  • పెరుగుదల కేవలం 0.34 శాతం


న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి గణాంకాలు ఒకవైపు ఆహార ధరల తీవ్రతను, మరోవైపు కీలక తయారీ రంగంలో మందగమనాన్ని సూచించాయి. 2020 జనవరిలో సూచీ రేటు మొత్తంగా 3.1 శాతంగా నమోదయితే, ఒక్క తయారీ రంగంలో ధరల పెరుగుదల రేటు 0.34 శాతంగా ఉంది. కాగా 2019 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.76 శాతం. ఇక 2019 ఏప్రిల్‌లో 3.18 శాతం టోకు ద్రవ్యోల్బణం నమోదయిన తర్వాత, మళ్లీ ఆ స్థాయి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. శుక్రవారం విడుదలైన ఈ గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...


ప్రైమరీ ఆర్టికల్స్‌:- ఫుడ్‌, నాన్‌-ఫుడ్‌ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 10.01 శాతంగా ఉంది. అంటే 2019 జనవరితో (అప్పట్లో 3 శాతం) పోల్చితే ఈ బాస్కెట్‌ మొత్తం ధర 10.01 శాతం పెరిగిందన్నమాట. ఇక ఇందులో ఒకటైన ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ ధర 2.41 శాతం (2019 జనవరిలో) నుంచి 11.51 శాతానికి పెరిగింది. సామాన్యునిపై నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని ఈ రేటు సూచిస్తోంది. నాన్‌ ఫుడ్‌ ఆర్టికల్స్‌ ద్రవ్యోల్బణం రేటు 2.32 శాతం నుంచి 7.05 శాతానికి ఎగసింది. 
ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌: మొత్తం సూచీలో దాదాపు 13 శాతం వెయిటేజ్‌ ఉన్న  ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 1.85 శాతం నుంచి 3.42 శాతానికి పెరిగింది. 
తయారీ ఉత్పత్తులు: ఐఐపీలో దాదాపు 64 శాతం వెయిటేజ్‌ ఉన్న తయారీ రంగ ఉత్పత్తుల్లో ద్రవ్యోల్బణం రేటు 2.79 శాతం నుంచి 0.34 శాతానికి దిగింది. ఆర్థిక వ్యవస్థలో మందగమన ధోరణిని సూచిస్తున్న అంశమిది. 

 


కూరగాయల ధరలు 53 శాతం అప్‌...
ఫుడ్‌ ఆర్టికల్స్‌ టోకు ద్రవ్యోల్బణం జనవరిలో 11.51 శాతంగా నమోదయితే, వేర్వేరుగా కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు మరింత తీవ్రంగా ఉన్నాయి. కూరగాయల ధరలు భారీగా 52.72 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 293 శాతం ఎగశాయి. ఆలూ ధరలు 87.84 శాతం ఎగశాయి. ఈ వారం మొదట్లో వెలువడిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణ ఆరు సంవత్సరాల గరిష్టస్థాయిలో 7.59 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. 2014 మే (8.33 శాతం) తర్వాత ఈ స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి.  2019 ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని ఈ నెల మొదటి వారంలో జరిగిన  ఏడు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి రెండు సార్లు మినహా అంతకుముందు వరుసగా ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే వసూలు చేసే వడ్డీరేటు- రెపోను 135 బేసిస్‌ పాయింట్లమేర ఆర్‌బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపులో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయం తీసుకోగలిగిన ఆర్‌బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి రెండు సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయింది. You may be interested

ఆరవ నెలా ‘ఎగుమతుల’ ఆందోళన!

Saturday 15th February 2020

వృద్ధిలేకపోగా -1.66 శాతం క్షీణత 25.97 బిలియన్‌ డాలర్లుగా నమోదు దిగుమతుల ఎనిమిది నెలల క్షీణబాట  విలువలో 41.14 బిలియన్‌ డాలర్లు వాణిజ్యలోటు 15.17 బిలియన్‌ డాలర్లు న్యూఢిల్లీ: దేశం నుంచి జరుగుతున్న ఎగుమతులపై ఆందోళన కొనసాగుతోంది. ఆరు నెలల నుంచీ వృద్ధిలేకపోగా జారుడు బల్లపై (క్షీణ బాటన) ఎగుమతులు కొనసాగుతుండడం దీనికి కారణం. తాజా సమీక్షా నెల- 2020 జనవరిని చూస్తే, 2019 ఇదే నెలతో పోల్చి ఎగుమతులు 1.66 శాతం క్షీణించాయి. విలువలో ఎగుమతుల

జనాభా 130 కోట్లు .. పన్ను కట్టింది1.46 కోట్లు

Saturday 15th February 2020

కానీ ఏటా విదేశాలకు వెళుతున్న 3 కోట్ల మంది రూ.5 కోట్ల ఆదాయం దాటింది 8,600 మందే వారిలో రూ.కోటి దాటిన ప్రొఫెషనల్స్‌ 2,200 మొత్తం రిటర్న్లు వేసిన వారి సంఖ్య 5.78 కోట్లు 2018-19 ఆదాయ పన్ను రిటర్నుల్లో ఎన్నెన్ని చిత్రాలో... సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్లలో దేశంలో 1.5 కోట్ల ఖరీదైన కార్లు అమ్ముడుపోయాయి. రూ.కోటికి తక్కువ కాని ఫ్లాట్లు లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో మూడు కోట్ల మందికిపైగా పర్యాటకం, వ్యాపారాల

Most from this category