News


వాహన రంగానికి ఎదురు దెబ్బ

Saturday 11th January 2020
news_main1578712787.png-30843

  • గతేడాది ఆటో పరిశ్రమ అమ్మకాల్లో 13.77% క్షీణత
  • ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో 12.75% తగ్గుదల
  • మునుపెన్నడూ లేని విధంగా భారీ క్షీణత

న్యూఢిల్లీ: దేశీయ వాహన రంగ పరిశ్రమ గతేడాదిలో భారీ క్షీణతను నమోదుచేసింది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) శుక్రవారం విడుదలచేసిన గణాంకాల ప్రకారం.. 2019లో మొత్తం ఆటో రంగ పరిశ్రమ అమ్మకాలు 2,30,73,438 యూనిట్లు కాగా, అంతక్రితం ఏడాది (2018)లో అమ్ముడైన 2,67,58,787 యూనిట్లతో పోల్చితే ఏకంగా 13.77 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈ సంఘం వద్ద 1997 నుంచి ప్రతీ ఏడాదికి సంబంధించిన అమ్మకాల సమాచారం ఉండగా.. మునుపెన్నడూ లేని విధంగా గతేడాది విక్రయాలు భారీ క్షీణతను నమోదచేశాయి. ఇక ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 29,62,052 యూనిట్లుగా నిలిచాయి. ఈ విభాగంలో 12.75 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. 2013 తరువాత అత్యంత కనిష్టస్థాయి ఇది. ద్విచక్ర వాహన విభాగంలో 14.19 శాతం తగ్గుదల (1,85,68,280 యూనిట్ల విక్రయాలు) నమోదు కాగా, వాణిజ్య వాహన విభాగంలో 14.99 శాతం క్షీణత నమోదైంది. గతేడాది అమ్మకాలు ఈ స్థాయిలో పడిపోవడానికి.. భారత్ స్టేజ్-సిక్స్(బీఎస్-6) నిబంధనల అమలు వంటి ప్రభుత్వ నిర్ణయాలు, రుణ లభ్యత గణనీయంగా తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయని సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వడేరా వ్యాఖ్యానించారు. ఇక ఈ ఏడాదిలోనైనా ప్రభుత్వం జీఎస్‌టీ రేటును 18 శాతానికి తగ్గించి, స్క్రాపేజ్ విధానాన్ని అమలుచేస్తే పరిశ్రమ కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 



You may be interested

సంక్రాంతి ఆఫర్లకు విశేష స్పందన: ‘బిగ్‌ సి’

Saturday 11th January 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సంక్రాంతి ఆఫర్లకు విశేష స్పందన లభిస్తున్నట్లు మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌ సి’ వెల్లడించింది. ఆఫర్స్‌లో భాగంగా రూ.12 కోట్ల విలువైన బహుమతులతో పాటు రూ.5 కోట్ల విలువైన క్యాష్‌ పాయింట్లను కూడా అందిస్తున్నట్టు బిగ్‌ సి ఫౌండర్‌ ఎం.బాలు చౌదరి తెలిపారు. మైక్రోమ్యాక్స్‌ ఐ వన్‌ (2జీబీ) మరియు రూ.13,990 విలువగల హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని రూ.8,999కి... రూ.11,990 విలువగల లెనోవో

ఇన్ఫోసిస్‌.. బోణీ భేష్‌!

Saturday 11th January 2020

(అప్‌డేటెడ్‌...) క్యూ3లో నికర లాభం రూ.4,466 కోట్లు; 24 శాతం జంప్‌ 8 శాతం పెరిగి రూ.23,092 కోట్లకు ఆదాయం 2019-20 వృద్ధి అంచనాలు 10- 10.5 శాతానికి పెంపు బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్‌... అంచనాలను మించిన బంపర్‌ ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2019-20, క్యూ3) సంస్థ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.4,466 కోట్లకు చేరింది. 2018-19 సంవత్సరం

Most from this category