News


చాక్లెట్‌ ఖరీదు రూ. 4.3 లక్షలు

Wednesday 23rd October 2019
news_main1571803788.png-29067

- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 
 చాక్లెట్‌ తయారు చేసిన ఐటీసీ

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ ‘ఐటీసీ’..  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ను తయారు చేసింది. ఈ కంపెనీకి చెందిన ఫాబెల్లె బ్రాండ్ ‘ట్రినిటీ - ట్రఫుల్స్ ఎక్స్‌ట్రార్డినేర్’ పేరిట చాక్లెట్‌ను రూపొందించగా.. దీని ఖరీదు కేజీ రూ. 4.3 లక్షలుగా ప్రకటించింది. ఇంతటి ఖరీదైన చాక్లెట్‌ మరొకటి లేనందున గిన్నిస్‌ బుక్‌లో ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్థానం సంపాదించినట్లు కంపెనీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. చేతిలో సరిపడే ఒక్కో చెక్క పెట్టెలో 15 ట్రఫుల్స్ ఉండగా.. సగటు బరువు దాదాపు 15 గ్రాములు ఉన్నట్లు తెలిపింది. ఈ విధంగా ఒక కిలో రేటును నిర్ణయించినట్లు తెలిపింది. కేవలం భారత్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించినందుకు సంతోషంగా ఉందని ఐటీసీ ఫుడ్ డివిజన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుజ్ రుస్తాగి అన్నారు.



You may be interested

మార్కెట్లోకి ‘బెనెల్లి ఇంపీరియల్ 400

Wednesday 23rd October 2019

- ధర రూ. 1.69 లక్షలు న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌ బైక్స్‌ తయారీ సంస్థ ‘బెనెల్లి’.. భారత మార్కెట్లోకి తాజాగా తన క్లాసిక్‌ మోడల్‌ ‘ఇంపీరియల్ 400’ బైక్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 1.69 లక్షలు (ఎక్స్‌-షోరూం)గా ప్రకటించింది. ఈ బైక్‌ 374సీసీ ఎయిర్‌-కూల్డ్‌ బీఎస్‌ సిక్స్‌ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. రూ. 4,000 డౌన్‌ పేమెంట్‌తో బుకింగ్స్‌ను స్వీకరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మూడేళ్ల అపరిమిత కిలోమీటర్ల

కోటక్‌ బ్యాంక్‌ ఆదాయం రూ.12,543 కోట్లు

Wednesday 23rd October 2019

-51 శాతం పెరిగిన స్టాండ్‌అలోన్‌ నికర లాభం  -25 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం  న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.2,407 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.1,747 కోట్లు)తో పోల్చితే 38 శాతం వృద్ధి సాధించామని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.10,829 కోట్ల నుంచి రూ.12,543

Most from this category