News


331 బిలియన్‌ డాలర్లు పోగొట్టుకున్న ప్రపంచ కుబేరులు

Friday 13th March 2020
news_main1584086813.png-32461

కోవిడ్‌-19 ధాటికి ప్రపంచంలోని కుబేరుల సంపదంతా ఆవిరైపోతోంది. గురువారం ఒక్కరోజే ప్రపంచలోని 500 మంది సంపన్నులు 331 బిలియన్‌ డాలర్లను సంపదను నష్టపోయారు. గడిచిన ఎనిమేదళ్లలో ఒక్కరోజులోనే ఇంత పెద్ద మొత్తంలో సంపదను కోల్పోవడం ఇదే మొదటి సారని బ్లూంబర్గ్‌ బిలీయనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 500 మంది సంపన్నుల సంపదలో మొత్తం 950 బిలియన్‌ డాలర్లు నష్టపోయారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా మార్కెట్లు దెబ్బతినడంతో రెండు నెలల్లోపే 6.1 బిలియన్‌ డాలర్లను బిలీయనీర్లు కోల్పొయారని బ్లూంబర్గ్‌ పేర్కొంది. కరోనా మహమ్మారి భయాలు పెరగడంతో ఆయిల్‌ ధరలు పడిపోవడం మార్కెట్లు క్షీణించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఈ ఏడాది మొదట్లోనే సంపన్నుల గ్రూపు వారి సంపద నికర మొత్తంలో 16 శాతం కొల్పోయారని ఇండెక్స్‌ తెలిపింది.ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమలు మూతపడి, డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తులు లేకపోవడం, రవాణా నిలిచిపోవడంతో ఆయా దేశాల్లోని మార్కెట్లు పతనమవుతుండడంతో బిలీనియర్ల సంపదంతా ఆవిరైపోతుందని ఇండెక్స్‌ పేర్కొంది.



You may be interested

స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం ఇందుకే..!

Friday 13th March 2020

నేడు మార్కెట్లో అమ్మకాలు సునామిలా వెల్లువెత్తాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ నిఫ్టీలు 10శాతం పతనం కావడంతో లోయర్‌ సర్క్యూట్‌ విధించారు. దీంతో 45నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. ఈ తర్వాత తిరిగి ట్రేడింగ్‌ను కొనసాగించారు. సూచీలు నష్టాలను పూడ్చుకుంటున్నప్పటికీ.. మార్కెట్లో అమ్మకాల భయాలు ఇంకా మిగిలే ఉన్నాయి.  గత కొన్ని రోజులుగా, కోవిడ్‌ -19 అంటువ్యాధికి సంబంధించిన ఆందోళనలు, ఆర్థిక మందగమన భయం, ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్‌ ధర అనూహ్యంగా పతనం కావడం

మార్కెట్ల జోష్‌- అరబిందో, ఎస్‌బీఐ హైజంప్‌

Friday 13th March 2020

ప్రపంచ మార్కెట్ల బాటలో ఉన్నట్టుండి కుప్పకూలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి డ్రమటిక్‌గా కోలుకున్నాయి. ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌, ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, తగిన చర్యలు తీసుకుంటామంటూ సెబీ ప్రకటన వంటి అంశాలు సెంటిమెంటుకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 832 పాయింట్లు దూసుకెళ్లి 33,610కు చేరగా.. నిఫ్టీ 305 పాయింట్లు జంప్‌చేసి 9,895 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ

Most from this category