News


క్రాష్‌తో...కుబేరుల సంపద కరిగిపోయిందిలా..!

Saturday 29th February 2020
news_main1582965190.png-32189

ఇండియాలో  అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సంపద కరోనా వైరస్‌ ప్రభావంతో స్టాక్‌ మార్కెట్‌లు పతనమవ్వడంతో 5 బిలియన్‌డార్ల తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచంలో ఉన్న ఫార్చూన్‌ 500 బిలీయనీర్స్‌ సంపద కూడా అంతర్జాతీయ మార్కెట్ల పతనంతో 444 బిలియన్‌ డాలర్లుత తగ్గింది. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ సూచీ 12 శాతానికిపైగా పడిపోయింది. 2008 ఆర్థిఖ సంక్షోభం తర్వాత వరుసగా ఒక వారంలో మార్కెట్లు పడిపోవడం ఇదే ప్రథమం. ప్రపంచ మార్కెట్లలో 6 ట్రిలియన్‌ డాలర్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. బ్లూమ్‌బర్గ్‌ బిలీయనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటిదాక  500 బిలియనీర్లు ఆర్జించిన 78 బిలియన్‌ డాలర్ల సంపద కూడా ఆవిరైపోయింది. ప్రపంచ కుబేరుల్లో మొదటి మూడుస్థానాల్లో ఉన్న అమేజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌, ఎల్‌వీఎంహెచ్‌ చైర్మన్‌ బెర్నాడ్‌ అర్నాల్ట్‌ల సంపదలో 30 బిలియన్‌ డాలర్లు తగ్గాయి. ప్రపంచ కుబేరుల్లో 25వ స్థానంలో ఉన్న రాకెట్‌ మ్యాన్‌ ఎలాన్‌ మస్క్‌  టెస్లా కంపెనీ ఈ వారంలో 9 బిలియన్‌ డాలర్లను కోల్పోయింది. కాగా
కరోనా ప్రభావంతో సంపద కోల్పోయిన వారి జాబితా ఈ కింది విధంగా ఉంది....

S.no. పేరు

కంపెనీ పేరు

కోల్పోయిన సంపద(బిలియన్‌ డాలర్లు)

1. జెఫ్‌ బెజోస్‌ అమేజాన్‌     11.9
2 బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌,క్యాస్‌కేడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ 10
3 బెర్నాడ్‌అర్నాల్ట్‌  క్రిస్టియన్‌ డియోర్‌, ఎల్‌వీఎంహెచ్‌ 9.1
4 ఎలాన్‌ మస్క్‌ టెస్లా, స్పేస్‌ఎక్స్‌ 9
5 వారెన్‌ బఫెట్‌   బర్క్‌షైర్‌ హత్‌వే 8.8
6 అమ్యాన్‌సియో అర్టెగా     ఇండైటెక్స్‌ 6.8
7 మార్క్‌జూకర్‌బర్గ్‌     ఫేస్‌బుక్‌ 6.6
8 ల్యారీ పేజ్‌ ఆల్ఫాబెట్‌ 6.4
9 కార్లోస్‌ స్లిమ్‌    అమెరికా మూవిల్‌ 6.3
10 సెర్గీ బ్రిన్‌ ఆల్ఫాబెట్‌ 6.2


 



You may be interested

ఈ సమయంలో మల్టీక్యాప్‌ ఫండ్స్‌..

Sunday 1st March 2020

మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నప్పుడు ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలా..? అన్న సంశయం రిటైల్‌ ఇన్వెస్టర్లలో కనిపిస్తుంది. లార్జ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ ఇలా వేర్వేరుగా కాకుండా.. ఈ మూడింటికి చోటు ఇచ్చే మల్టీక్యాప్‌ ఫండ్స్‌ ఈ సమయంలో అనుకూలమని నిపుణులు సూచిస్తున్నారు. రిస్క్‌ ఉంటుందని పూర్తిగా లార్జ్‌క్యాప్‌నకే పరిమితం కాకుండా, దీర్ఘకాలంలో అధిక రాబడుల కోసం మిడ్‌, స్మాల్‌క్యాప్‌లోనూ కొంత మేర పెట్టుబడులు వైవిధ్యాన్నిస్తాయని తెలిసిందే.   మార్కెట్‌ డేటాను గమనిస్తే.. 2015-2018

మరో రూ.8,004 కోట్లు చెల్లించిన ఎయిర్‌టెల్

Saturday 29th February 2020

న్యూఢిల్లీ:- ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల్లో భాగంగా కేంద్ర టెలికాం శాఖకు రూ.8,004 కోట్లను చెల్లించినట్లు భారతీ ఎయిర్‌టెల్ శనివారం తెలిపింది. ఈ నెల ప్రారంభంలో కంపెనీ తన ఏజీఆర్‌ బకాయిల్లో భాగంగా రూ .10,000 కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది. ఇప్పటి తాజా చెల్లింపుతో కలిపి మొత్తం రూ.18,004 కోట్లు చెల్లించినట్లైంది. ఏజీఆర్‌కు సంబంధించిన స్వీయ మదింపు కసరత్తు పూర్తైందని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఇందులో భారతీ ఎయిర్‌టెల్, భారతీ హెక్సాకోమ్,

Most from this category