భూషణ్ పవర్‌ను కొంటాం ..కానీ..
By Sakshi

న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ కింద వేలానికి వచ్చిన భూషణ్ పవర్ అండ్ స్టీల్ (బీపీఎస్ఎల్)ను కొనుగోలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తెలిపింది. అయితే, ఆ సంస్థ మాజీ ప్రమోటర్లు మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపైనే కొంత ఆందోళన ఉన్నట్లు, కంపెనీలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు వివరించింది. దీంతో బీపీఎస్ఎల్ ఫోరెన్సిక్ రిపోర్టును జేఎస్డబ్ల్యూకి అందజేయాలంటూ పరిష్కార నిపుణుడికి (ఆర్పీ) ఎన్సీఎల్టీ సూచించింది. ఫ్రాడ్ ఆరోపణలు ఉన్నప్పటికీ బీపీఎస్ఎల్ దివాలా పరిష్కార ప్రక్రియ, జేఎస్‌డబ్ల్యూ ప్రణాళికపై వాటి ప్రభావమేమీ ఉండబోదని పేర్కొంది. బీపీఎస్ఎల్ కొనుగోలుకు జేఎస్‌డబ్ల్యూ రూ. 18,000 కోట్లు ఆఫర్ చేయగా ఈ ఏడాది మార్చి 31లోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్సీఎల్టీని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే, ఎన్సీఎల్టీ దీనిపై ఇంకా తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఈలోగా బీపీఎస్ఎల్ ప్రమోటర్లు దాదాపు రూ. 3,805 కోట్ల మేర రుణాల మోసాలకు పాల్పడినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు, రూ. 1,774 కోట్ల మేర ఫ్రాడ్ చేసినట్లు అలహాబాద్ బ్యాంకు బైటపెట్టడంతో దివాలా పరిష్కార ప్రక్రియపై సందేహాలు తలెత్తాయి.
You may be interested
ఫైనాన్స్, ఫార్మాలో ఈ షేర్లు బెస్ట్: ఇండిట్రేడ్ ఛైర్మన్
Tuesday 16th July 2019ఇన్ఫోసిస్, టీసిఎస్ వాల్యుషన్ గ్యాప్ తగ్గనుంది. సన్ ఫార్మా, డా.రెడ్డిస్ షేర్లు మంచి లాభాలను ఇవ్వగలవు ఫైనాన్స్ షేర్లలో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ బుల్లిష్‌గా ఉన్నాయి. ఫార్మాలో పెట్టుబడులు పెట్టేటప్పుడు రక్షణాత్మక దోరణిని అవళింబించవచ్చు కానీ ఈ షేర్లు ఎల్లప్పుడూ రక్షణాత్మకంగా ఉండకపోవచ్చని ఇండిట్రేడ్ క్యాపిటల్ చైర్మన్ సుదీప్ బంద్యోపధ్యాయ్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... ఇన్ఫోసిస్ అంచనాలకు మించి... ఇన్ఫోసిస్ పాజిటివ్ ఫలితాలను ప్రకటిస్తుందని అంచనా
ప్రత్యేక కంపెనీగా గెయిల్ పైప్‌లైన్ విభాగం !
Tuesday 16th July 2019కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థ, గెయిల్ (ఇండియా)ను విభజించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గెయిల్ కంపెనీ పైప్‌లైన్ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని, ఈ విభాగాన్ని వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు విక్రయించనున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐఓసీ, బీపీసీఎల్ల ఆసక్తి... దేశంలోనే అతి పెద్ద నేచురల్ గ్యాస్ మార్కెటింగ్, ట్రేడింగ్ కంపెనీగా గెయిల్ ఇండియా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశంలోని 16,234 కిమీ. గ్యాస్‌పైప్‌లైన్ నెట్‌వర్క్‌లో మూడింట రెండొంతులు ఈ కంపెనీదే.