News


కాగ్నిజంట్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య లక్షకు

Wednesday 2nd October 2019
news_main1569993778.png-28671

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజంట్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటింది. ఇందులో 75వేల మందికి పైగా మహిళలు భారత్‌లోనే పనిచేస్తుండడం గమనార్హం. మొత్తం ఉద్యోగులు రూ.2.88 లక్షల మందిలో మహిళలు 34 శాతానికి చేరినట్టు కాగ్నిజంట్‌ తెలిపింది. భారత్‌లోని మొత్తం ఉద్యోగుల పరంగా చూస్తే మహిళా ఉద్యోగులు 35 శాతంగా ఉన్నారు. 100కు పైగా దేశాలకు చెందిన మహిళలు సంస్థలో పనిచేస్తున్నారు. కనీసం లక్ష మంది మహిళా ఉద్యోగులను 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా కలిగి ఉండాలని సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, 2019లోనే దాన్ని సాధించేసింది. పైగా వారిలో 75 శాతం భారత్‌ నుంచే పనిచేస్తుండడం విశేషం. ముఖ్యంగా కోయంబత్తూర్‌, కోచి, మంగళూరులోని కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు 50 శాతానికి చేరువయ్యారు. You may be interested

10 ఏళ్ల కనిష్ఠానికి యుఎస్‌ తయారీ రంగం!

Wednesday 2nd October 2019

దీర్ఘకాలంగా కొనసాగతున్న యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వలన సెప్టెంబర్‌ నెలకు సంబంధించి యుఎస్‌ తయారిరంగ డేటా పదేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని ఐఎస్‌ఎం(ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సప్లే మేనేజ్‌మెంట్‌) ఇండెక్స్‌ పేర్కొంది. జులై నెలలో 49.1 శాతంగా ఉన్న తయారిరంగం పనితీరు డేటా, సెప్టెంబర్‌లో 47.8 శాతానికి పడిపోయిందని, 2009 జూన్‌ తర్వాత ఇదే కనిష్ఠ స్థాయని ఈ డేటా పేర్కొంది. కాగా సెప్టెంబర్‌లో ఈ డేటా 50.2 శాతంగా ఉంటుందని విశ్లేషకులు అంచనావేసినప్పటికీ పదేళ్ల

పీఎన్‌బీ ఎండీ, సీఈఓగా మల్లిఖార్జున రావు

Wednesday 2nd October 2019

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా సీహెచ్‌ ఎస్‌ఎస్‌ మల్లిఖార్జున రావు నియమితులయ్యారు. 57 సంవత్సరాల ఆయన ప్రస్తుతం అలహాబాద్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా నియమితులైన బాధ్యతల్లో 2021 సెప్టెంబర్‌ 18 వరకూ లేదా తదుపరి ఉత్తర్వ్యులు వెలువడేవరకూ కొనసాగుతారు. ‘‘మల్లిఖార్జునరావు పోస్టింగ్‌కు సంబంధించి ఆర్థిక సేవల శాఖ చేసిన ప్రతిపాదనను నియామక వ్యవహారాల క్యాబినెట్‌

Most from this category