News


ఆధార్‌ లేదా పాన్‌ ఇవ్వకుంటే..టీడీఎస్‌ 20 శాతం -ఐటీ శాఖ

Saturday 25th January 2020
Markets_main1579941666.png-31202

ఇకపై ఉద్యోగులు తప్పనిసరిగా పాన్‌ నెంబర్‌ లేదా ఆధార్‌ను ఆదాయ పన్ను శాఖకు తెలియజేయవలసి ఉంటుంది. లేదంటే వేతనం పొం‍దే సంస్థ వద్ద విధించే పన్ను(టీడీఎస్‌) 20 శాతం చెల్లించవలసి ఉంటుంది.  ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం ఇకపై ఉద్యోగులు పాన్‌ నంబర్‌ లేనిపక్షంలో కనీసం ఆధార్‌ సంఖ్యనైనా వెల్లడించవలసి ఉంటుంది. పాన్‌ నంబర్‌ ఇవ్వని పక్షంలో కంపెనీ(ఎంప్లాయర్‌) లేదా బ్యాంకు పన్నును వసూలు చేయనున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. గత బడ్జెట్‌లోనే కేంద్ర ప్రభుత్వం పాన్‌ నంబర్‌ లేని పక్షంలో ఆధార్‌ను దాఖలు చేయడాన్ని తప్పనిసరి చేసింది. పాన్‌ నంబర్‌లేని వ్యక్తులు ఆధార్‌ సంఖ్యను దాఖలుచేస్తే.. ఇలాంటి సందర్భాలలో ఆదాయ పన్ను శాఖ పాన్‌ నంబర్‌ను ఆటోమేటిక్‌గా జారీ చేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.



You may be interested

బడ్జెట్‌ నచ్చకపోతే మార్కెట్లో మహా పతనమే!

Saturday 25th January 2020

నిపుణుల అంచనా వచ్చే వారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై మార్కెట్‌ వర్గాల్లో చాలా ఆశలున్నాయి. ఈ ఆశలతో నిఫ్టీ 12వేల పాయింట్ల పైన కొనసాగుతూ వస్తోంది. చిన్న, మధ్యతరహా స్టాకుల్లో బడ్జెట్‌ ఆశలతో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. దీంతో నిఫ్టీ ఈ వారం 12400 పైన గరిష్ఠాలను తాకగలిగింది. అయితే అధిక వాల్యూషన్ల కారణంగా పైన నిలదొక్కుకోలేక వెనక్కు వచ్చింది. మరోవైపు ఐఎంఎఫ్‌ తాజాగా భారత వృద్ధి అంచనాలను 4.8 శాతానికి

మరోసారి 1600డాలర్ల వైపు పసిడి

Saturday 25th January 2020

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర తొందర్లో మరోసారి 1600డాలర్లస్థాయిని అందుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల అమెరికా-ఇరాన్‌ సంక్షోభ సమయంలో ఒక్క ఉదుటన 1600 డాలర్లపైకి ఎగిసి, అటుతర్వాత క్రమేపీ 1,550 డాలర్లస్థాయికి పసిడి దిగివచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల ఆందోళనతో గత రెండు రోజుల నుంచి పసిడి పెరుగుతూ వస్తోంది. ఇక వచ్చే వారంలో అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్యపరపతి సమావేశాలు, చైనాలో కరోనా

Most from this category