News


వచ్చేస్తోంది కొత్త ఐఫోన్‌

Friday 30th August 2019
news_main1567143615.png-28106

  •  వచ్చే నెల 10న ఆవిష్కరణ

శాన్‌ ఫ్రాన్సిస్కో: త్వరలో కొత్త ఐఫోన్ వెర్షన్‌ను ప్రవేశపెట్టనుందన్న వార్తలకు ఊతమిస్తూ టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే నెల 10న సిలికాన్ వేలీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఇన్విటేషన్లు పంపింది. సాధారణంగా ఏటా క్రిస్మస్‌ షాపింగ్ సీజన్‌కు ముందు.. ఇలాంటి కార్యక్రమంలోనే యాపిల్ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ వస్తోంది. దానికి అనుగుణంగానే ఈసారీ సెప్టెంబర్ 10న జరిగే కార్యక్రమంలో 'ఐఫోన్‌ 11' హ్యాండ్‌సెట్స్‌ను కూడా ఆవిష్కరించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం మూడు ఐఫోన్‌ 11 మోడల్స్‌ను ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌ని అప్‌గ్రేడ్‌ చేసి ఎక్స్‌ఎస్‌, ఎక్స్‌ఆర్‌ మోడల్స్‌ను కొత్త రూపంలో ఆవిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐఫోన్ ఎక్స్‌ఎస్‌ సిరీస్‌ స్థానంలో వచ్చే కొత్త ఐఫోన్ 11 మోడల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. 



You may be interested

డిజిటల్‌లో అగ్రగామిగా భారత్‌

Friday 30th August 2019

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ గాంధీనగర్‌: డిజిటల్ రంగంలో భారత్ త్వరలోనే అగ్రగామిగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్ ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. "డిజిటల్ రంగం ప్రతీ రోజూ, ప్రతీ క్షణం కొత్త పుంతలు తొక్కుతున్న దేశం ఏదైనా ఉందంటే .. అది భారత్‌ మాత్రమేనని ఘంటాపథంగా చెప్పగలను. మొబైల్ డేటా విభాగంలో ప్రపంచ దేశాల జాబితాలో 155వ స్థానంలో ఉండే భారత్‌

రామ్‌కో సిమెంట్‌ భారీ విస్తరణ

Friday 30th August 2019

రూ.4,000 కోట్ల పెట్టుబడి కంపెనీ ఈడీ బాలాజీ మూర్తి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- సిమెంటు తయారీ సంస్థ రామ్‌కో సిమెంట్స్‌ భారీ విస్తరణ చేపట్టింది. ఇందుకోసం రూ.4,000 కోట్లు వ్యయం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 3.15 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో సిమెంటు ఉత్పత్తి కేంద్రాన్ని రూ.1,500 కోట్లతో నెలకొల్పుతోంది. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి లభిస్తుందని రామ్‌కో మార్కెటింగ్‌ ఈడీ బాలాజీ కె మూర్తి

Most from this category