News


ఏజీఆర్‌తో మొండిబకాయిల ముప్పు!

Saturday 15th February 2020
news_main1581742114.png-31819

వీఐఎల్‌ దివాలా తీస్తుందని భయపడుతున్న బ్యాంకులు
ఏజీఆర్‌ బకాయిలు ఎలాగైనా చెల్లించాల్సిందేనన్న సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వొడాఫోన్‌ఐడియా(వీఐఎల్‌) దివాలా ప్రకటించే అవకాశం ఉందని బ్యాంకులు భయపడుతున్నాయి. ఇదే జరిగితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బ్యాంకింగ్‌ రంగంలో తిరిగి కొన్నేళ క్రితం పరిస్థితులు తలెత్తవచ్చని, మొండిపద్దుల గుదిబండ మెడలో పడొచ్చని ఆందోళన పడుతున్నాయి. ఏజీఆర్‌ కింద వీఐఎల్‌ సంస్థ డీఓటికి దాదాపు రూ.53వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది. అయితే కంపెనీ ఇంత మొత్తం చెల్లించే స్థితి లేదని, అందువల్ల దివాలా బాట పట్టవచ్చని, ఇదే జరిగితే కంపెనీకి ఇచ్చిన రూ.30వేల కోట్ల పరిస్థితి ఏంటని బ్యాంకులు మధనపడుతున్నాయి. ఈ భయాలతో వీఐఎల్‌ షేరు శుక్రవారం ఒకదశలో దాదాపు 23 శాతం పతనమైంది. వీఐఎల్‌కు ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు లోన్లు, గ్యారెంటీల కింద మొత్తాలను సమకూర్చాయి. గోల్డ్‌మన్‌ సాక్స్‌ ప్రకారం వీఐఎల్‌కు  ఎస్‌బీఐ- రూ. 11200 కోట్లు, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌- రూ. 5000 కోట్లు, ఐడీఎఫ్‌సీ- రూ.2500 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు- రూ. 1725కోట్లు, పీఎన్‌బీ- రూ. 1027.7 కోట్లమేర రుణాలిచ్చాయి. వీఐఎల్‌ నెత్తిన మొత్తం రూ. 1.26 లక్షల కోట్లుంటుందని మాక్క్వైరీ అంచనా వేసింది. ఇందులో దాదాపు 90700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలుంటాయని అంచనా. ఇప్పటికే బ్యాంకుల వద్ద రుణాలు తీసుకున్న రెండు టెల్కోలు ఆర్‌కామ్‌; ఎయిర్‌సెల్‌కు సంబంధించిన కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వీఐఎల్‌కూడా ఇదే దోవలోచేరితే మరిన్ని ఇక్కట్లు తప్పవని బ్యాంకర్ల ఆందోళన. టెల్కోలు ప్రభుత్వంతో మాట్లాడాలని, ఈవిషయమై ఇప్పటికే వాటితో మాట్లాడామని, ఈ బకాయిల సమస్య అనుకోకుండా వచ్చింది కాదని టెల్కోలకు కూడా తెలుసని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ చెప్పారు. ఎస్‌బీఐకి వీఐఎల్‌ నుంచి సమయానుగతంగా చెల్లింపులు జరుగుతుండడంతో ఇంతవరకు ఈ బకాయిని మొండిపద్దుల ఖాతాలోకి మార్చలేదు. ఐడీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు తదితరాలు సైతం వీఐఎల్‌తో ఇంతవరకు చెల్లింపుల సమస్య ఎదురుకాలేదనే చెబుతున్నాయి. 
మొత్తం టెలికం రంగానికి బ్యాంకులిచ్చిన రుణాలు చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో వీఐఎల్‌ మూతపడితే పలు బ్యాంకులపై ఎన్‌పీఏల ఒత్తిడి పెరగడంతో పాటు బ్యాంకింగ్‌ రంగం మరోమారు సంక్షోభంలోకి జారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెల్కోలు ముందు ప్రిన్సిపుల్‌ మొత్తం కట్టి మిగిలినవి తగు వాయిదాల్లో చెల్లించేలందుకు సుప్రీంకోర్టు అనమతించాలని బ్యాంకుల ఆశిస్తున్నాయి. ఈ మొత్తం రూ.7-10 వేల కోట్ల మధ్య ఉంటుంది కాబట్టి టెల్కోలకు కొంత ఊరట, కొంత సమయం లభిస్తాయని బ్యాంకుల భావిస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఇదే తమ చివరి ఆశని సీనియర్‌ బ్యాంకు అధికారి ఒకరు వాపోయారు. బ్యాంకింగ్‌ రంగ ప్రక్షాళన చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడెలా స్పందిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 



You may be interested

5 శాతం జీడీపీ వృద్ధితో 15 శాతం ఈపీఎస్‌ వృద్ధి!

Saturday 15th February 2020

మెరిలించ్‌ సలహాదారు రాజ్‌శర్మ ఎకానమీలో జీడీపీ వృద్ధి బాగుంటే అది క్రమంగా కంపెనీల ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌లో ప్రతిబింబిస్తుందని మెరిలించ్‌ ఎండీ రాజ్‌శర్మ చెప్పారు. జీడీపీ 5 శాతం వృద్ది ఉంటే 15 శాతం ఈపీఎస్‌ వృద్ధి నమోదవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఇండియా వాల్యూషన్లు చౌకగా లేవని కానీ దేశీయ వృద్ధి అవకాశాలు చూస్తే వచ్చే 3-5 ఏళ్లలో మార్కెట్లు మంచి వృద్ధినే నమోదు చేస్తాయని అంచనా వేశారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్‌కు

భారీగా పెరిగిన పసిడి

Saturday 15th February 2020

జర్మనీ,జపాన్‌ కరెన్సీలు యూరో,యన్‌లు పడిపోవడంతో శనివారం బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో రూ.324 పెరిగి 10 గ్రాముల బంగారం ధర 40,980.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ల్లో  8 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,587 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)  

Most from this category