News


విప్రో చేతికి అమెరికా కంపెనీ!

Thursday 6th June 2019
news_main1559804604.png-26128

  • ఐటీఐను చేజిక్కించుకుంటున్న విప్రో
  • డీల్‌ విలువ రూ.312 కోట్లు

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ టెక్నీ గ్రూప్‌ ఇన్‌కార్పొను (ఐటీఐ) కొనుగోలు చేయనున్నది. కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్ట్‌ లైఫ్‌సైకిల్‌ మేనేజ్‌మెంట్‌ ఇంటెరోపెరాబిలిటీ సాఫ్ట్‌వేర్‌ సేవలందించే ఐటీఐను రూ.312 కోట్లు( 4.5 కోట్ల డాలర్లు)కు కొనుగోలు చేయనున్నామని విప్రో తెలిపింది. 1983లో ఆరంభమైన ఐటీఐ అమెరికాలోని ఓహియో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంగ్లాండ్‌, ఇటలీ, ఇజ్రాయేల్‌, జర్మనీల్లో ఈ కంపెనీకి కార్యాలయాలున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఈ కంపెనీలో మొత్తం 130 మంది ఉద్యోగులున్నారు. కంపెనీ ఆదాయం గత ఏడాది జూన్‌ 30 నాటికి 2.32 కోట్ల డాలర్లుగా ఉంది. 
సెప్టెంబర్‌ కల్లా డీల్‌ పూర్తి ..! 
ఐటీఐ కొనుగోలు కారణంగా డిజిటల్‌  ఇంజినీరింగ్‌ మాన్యుఫాక్చరింగ్‌ విభాగంలో మరింత శక్తివంతమవుతామని విప్రో కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(ఇండస్ట్రియల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌) హర్మీత్‌ చౌహన్‌ పేర్కొన్నారు. ఈ కంపెనీ కొనుగోలుకు నియంత్రణ సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్‌ కల్లా ఈ డీల్‌ పూర్తవ్వగలదన్న అంచనాలున్నాయని వివరించారు.



You may be interested

‘సుందర్‌ పిచాయ్‌’కు గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు

Thursday 6th June 2019

వాషింగ్టన్‌: గూగుల్‌ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌కు అరుదైన గౌరవం దక్కింది. టెక్నాలజీ రంగంలో ఈయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన అమెరికా-భారత వాణిజ్య మండలి (యూఎస్‌ఐబీసీ).. ప్రతి ఏడాది ఇచ్చే గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డుకు పిచాయ్‌ను ఎంపికచేసినట్లు ప్రకటించింది. ఈయనతో పాటు నాస్‌డాక్‌ ప్రెసిడెంట్‌ అడెనా ఫ్రైడ్‌మాన్‌ పేరును ప్రకటించిన యూఎస్‌ఐబీసీ.. ఇరువురి నేతృత్వంలోని కంపెనీలు, అంతర్జాతీయ టెక్నాలజీ రంగ ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేయడంలో తమవంతు కృషిచేసినట్లు

బ్యాంకుల కొత్త మంత్రం ‘ఫిజిటల్‌’!

Thursday 6th June 2019

- ఒకవైపు డిజిటల్‌... మరోవైపు శాఖల విస్తరణ - భారీ బ్రాంచ్‌ నెట్‌వర్క్‌తోనే ఖాతాదారులకు భరోసా - కొత్త కస్టమర్లను చేరుకోవటానికి పోటాపోటీ - ఏటా 400 శాఖలు ఏర్పాటు చేయనున్న యాక్సిస్‌ - ఈ ఏడాదిలో కొత్త శాఖలపై కసరత్తు: ఫెడరల్‌ బ్యాంక్‌ (సాక్షి, బిజినెస్‌ విభాగం) డిజిటల్‌ మాధ్యమంలో ఆర్థిక లావాదేవీలు క్రమంగా ఊపందుకుంటున్నప్పటికీ.. బ్యాంకులు సప్రదాయ బ్రాంచి బ్యాంకింగ్‌ను కూడా మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఇటు మొబైల్, డిజిటల్‌ అటు బ్రాంచీల సాయంతో

Most from this category