News


బోనస్‌కు విప్రో వాటాదారుల ఆమోదం

Monday 25th February 2019
news_main1551069012.png-24311

న్యూఢిల్లీ: బోనస్‌ ఇష్యూ ప్రతిపాదనకు, అధీకృత మూలధనం పెంపునకు మెజారిటీ వాటాదారులు ఆమోదం తెలిపినట్టు విప్రో తెలిపింది. వాటాదారుల వద్దనున్న ప్రతి మూడు షేర్లకు (ముఖ విలువ రూ.2) ఒక షేరును బోనస్‌గా ఇవ్వడానికి విప్రో బోర్డు జనవరిలో నిర్ణయించిన విషయం గమనార్హం. ఫిబ్రవరి 22 గడువు నాటికి అవసరమైన మెజారిటీ వాటాదారులు బోర్డు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు విప్రో స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. అధీకృత మూలధనం పెంపునకు 98.82 శాతం, బోనస్‌ షేర్ల జారీకి 99.81 శాతం మంది వాటాదారుల ఆమోదం లభించినట్టు వెల్లడించింది. బోనస్‌ షేర్ల జారీ ద్వారా కంపెనీ అధీకృత మూలధనం రూ.1,126.50 కోట్ల నుంచి రూ.2,526.50 కోట్లకు పెరగనుంది.



You may be interested

నిఫ్టీ తక్షణ అవరోధం 10,850

Monday 25th February 2019

తక్షణ అవరోధం 36,100 కొద్దినెలలుగా ప్రపంచ ట్రెండ్‌కు భిన్నంగా దేశీయ సూచీలు కదులుతూ వస్తున్నాయి. ఇదేరీతిలో గతవారం ప్రపంచ మార్కెట్లన్నీ నెలల గరిష్టస్థాయి వద్ద ట్రేడవుతుండగా, భారత్‌ మార్కెట్‌ మాత్రం రెండు శాతం శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. వడ్డీ రేట్ల పెంపునకు అమెరికా ఫెడ్‌ బ్రేకులు వేయడం, అమెరికా-చైనాల వాణిజ్య చర్చల పట్ల ఏ రోజుకారోజు ఇరు దేశాల అధ్యక్షులూ సానుకూల ప్రకటనలు చేయడం ప్రపంచ మార్కెట్ల ర్యాలీకి ఊతమివ్వగా, మరో

జెట్‌ ఎయిర్‌వేస్‌పై దివాలా పిటీషన్‌

Monday 25th February 2019

యోచనలో ఎస్‌బీఐ !! న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌పై దివాలా పిటీషన్‌ దాఖలు చేయాలని ఎస్‌బీఐ యోచిస్తోందని సమాచారం. నిర్వహణ కార్యకలాపాలకే నిధుల్లేక జెట్‌ ఎయిర్‌వేస్‌ అల్లాడుతున్న విషయం తెలిసిందే. రుణ పునర్వ్యస్థీకరణకు, రుణాలను ఈక్విటీగా మార్చడానికి తదితర  మరికొన్న ప్రతిపాదనలకు వాటాదారులు ఈ నెల 21న జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్‌)ఇటీవలే ఆమోదం తెలిపారు. మరోవైపు ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంక్‌ల కన్సార్షియమ్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.500 కోట్ల మేర నిధులను కూడా

Most from this category