News


లాభం భేష్‌.. బోనస్‌ జోష్‌!

Saturday 19th January 2019
Markets_main1547878660.png-23678

  • క్యూ3లో రూ. 2,544 కోట్లు
  • ఆదాయంలో రూ. 10% వృద్ధి
  • రూ.1 మధ్యంతర డివిడెండ్‌..

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ సేవల దిగ్గజం విప్రో నికర లాభం సుమారు 31.8 శాతం ఎగిసి రూ.2,544.5 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.1,930.1 కోట్లు. మరోవైపు, కంపెనీ ఆదాయం రూ. 10 శాతం వృద్ధితో రూ.13,669 కోట్ల నుంచి రూ.15,059.5 కోట్లకు చేరింది. క్యూ3 ఫలితాల వెల్లడి సందర్భంగా రూ. 2 ముఖ విలువ గల షేరు ఒక్కో దానికి రూ.1 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందుకోసం జనవరి 30 రికార్డు తేదీగా ఉంటుందని పేర్కొంది. "క్లయింట్లతో పటిష్టమైన సంబంధాలు, వ్యూహాత్మక పెట్టుబడులు, కార్యకలాపాల ఆధునికీకరణపై క్లయింట్లు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తుండటం తదితర అంశాలు మెరుగైన పనితీరు కనపర్చేందుకు దోహదపడ్డాయి" అని విప్రో సీఈవో, ఈడీ ఆబిదాలి నీముచ్‌వాలా తెలిపారు.
ఐటీ ఆదాయం 1.8% వృద్ధి..
కీలకమైన ఐటీ సర్వీసుల విభాగం ఆదాయాలు త్రైమాసికాల వారీగా (సీక్వెన్షియల్‌) చూస్తే 1.8 శాతం వృద్ధితో రూ. 2,046.5 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 14,555 కోట్లు) నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో డాలర్ల మారకంలో చూస్తే ఐటీ సేవల వ్యాపార విభాగం ఆదాయాలు సీక్వెన్షియల్ ప్రాతిపదికన సుమారు 2 శాతం వృద్ధి సాధించవచ్చని విప్రో అంచనా వేస్తోంది. ఇది 2,047 మిలియన్ డాలర్ల నుంచి 2,088 మిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని తెలిపింది.
మూడుకు ఒకటి బోనస్..
ప్రతి మూడు షేర్లకు ఒకటి చొప్పున బోనస్‌ షేర్లు జారీ చేయనున్నట్లు విప్రో తెలిపింది. అటు అమెరికన్ డిపాజిటరీ రిసీట్‌ ఏడీఆర్‌లకు కూడా ఇదే నిష్పత్తిలో బోనస్ షేర్ల కేటాయింపు ఉంటుందని వివరించింది. ఇందుకు సంబంధించిన రికార్డు తేదీని తర్వాత ప్రకటించనున్నట్లు విప్రో పేర్కొంది. గతంలో 2017 ఏప్రిల్‌లో విప్రో 1:1 నిష్పత్తిలో బోనస్ ఇష్యూ చేపట్టింది. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ. 46,848 కోట్ల మేర మిగులు నిధులు ఉన్నాయని విప్రో పేర్కొంది. కొత్తగా రూ.2 ముఖవిలువ గల 700 కోట్ల షేర్లను జారీ చేయడం ద్వారా ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్‌ను రూ. 1,126.5 కోట్ల నుంచి రూ. 2,526.5 కోట్లకు పెంచుకున్నట్లు తెలిపింది.



You may be interested

కార్వీ ట్రేడింగ్‌లో 40శాతం​ యాప్‌తోనే

Saturday 19th January 2019

ఆన్‌లైన్‌ ఆధారిత పెట్టుబడుల పెరుగుదల వచ్చే ఏడాదికల్లా హైదరాబాద్‌ రీసెర్చ్‌ టీమ్‌లో 70 మంది స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే నిఫ్టీ కొత్త శిఖరాలకు ఆటో షేర్లు వద్దు... ప్రభుత్వ రంగ బ్యాంకులు బెటర్‌ కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సీఈఓ రాజీవ్‌ సింగ్‌ వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫైనాన్షియల్‌ బ్రోకరేజ్‌ కంపెనీ కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ మొత్తం ఆదాయంలో కార్వీ ఆన్‌లైన్‌ ట్రేడ్‌ మొబైల్‌ యాప్‌ వాటా 40 శాతం వరకూ ఉంటుందని కంపెనీ సీఈఓ రాజీవ్‌

ఏడాదిలో 2,000 మంది నియామకం

Saturday 19th January 2019

ఫిన్‌కేర్‌ ఎండీ రాజీవ్‌ యాదవ్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బ్యాంకింగ్‌ సేవల రంగంలో ఉన్న ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ పెద్ద ఎత్తున నియామకాలను చేపడుతోంది. ఏడాదిలో కొత్తగా 2,000 మందిని చేర్చుకోనున్నట్టు బ్యాంక్‌ ఎండీ రాజీవ్‌ యాదవ్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 5,200 మంది పనిచేస్తున్నారని చెప్పారు. ‘11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తోంది. 14 లక్షల మంది కస్టమర్లున్నారు. అసెట్‌

Most from this category