News


ఇండియాతో భారీ డీల్‌ జరగొచ్చు..ట్రంప్‌!

Friday 21st February 2020
news_main1582262493.png-31981

అమెరికా, భారత్‌ల మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. లాస్‌వేగాస్‌లో ప్రిసనర్స్‌ గ్రాడ్యూయేషన్‌ సెర్మనీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..ఈ నెలలో తాము ఇండియా వెళ్తున్నామని, ఆదేశంతో భారీ ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. కాగా ఫిబ్రవరి 24 నుంచి 25 తేదీలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, యూఎస్‌ ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌ అహ్మాదాబాద్‌, ఆగ్రా, న్యూఢిల్లీలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య భారీ వాణిజ్య ఒప్పందాలు జరగవచ్చని, అమెరికాకు మేలుకరమైన ఒప్పందాల పట్ల సుముఖంగా ఉన్నామని ట్రంప్‌ చెప్పారు. ఒక వేళ ఇప్పుడు ఇరుదేశాల మధ్య ఒప్పందాలు జరగకపోతే అమెరికా ఎన్నికల తర్వాతే వాణిజ్య ఒప్పందాలు ఉంటాయన్నారు. కాగా అమెరికా ప్రపంచ వాణిజ్యంలో ఇండియా భాగస్వామ్యం 3శాతం గా మాత్రమే ఉంది. కాంగ్రేషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌(సీఆర్‌ఎస్‌) నివేదిక ప్రకారం 2018లో ఇండియాకు పెద్ద మొత్తంలో ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో యూరోపియన్‌ యూనియన్‌ తర్వాత అమెరికా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ఇక దిగుమతుల విషయంలో చైనా తరువాత మూడో స్థానంలో ఉంది. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 75 పాయింట్లు క్రాష్‌..!

Friday 21st February 2020

ప్రపంచ ఈక్వీటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం మధ్యాహ్నం ట్రేడింగ్‌లో  75 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. నిన్నటి నిఫ్టీ ఫ్యూచర్స్‌ ముగింపు(12079.00)తో పోలిస్తే 75 పాయింట్లను కోల్పోయి 12,004.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో అంతర్జాతీయ వృద్ధి మందగమనం భయాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను వెంటాడుతున్నాయి. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు ఇంట్రాడేలో 1శాతం నష్టపోగా, నేడు ఆసియాలో

ప్యానాసోనిక్‌ నుంచి నూతన శ్రేణి ఏసీలు

Friday 21st February 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ప్యానాసోనిక్‌ 2020 సంవత్సరానికిగాను కొత్త ఎయిర్‌ కండీషనర్లను ప్రవేశపెట్టింది. మొత్తం 55 ఏసీలను అందుబాటులోకి తేగా.. వీటిలో ఇంటర్నెట్‌తో పనిచేసే ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ ఆధారిత మిరాయ్‌ శ్రేణి కనెక్టెడ్‌ మోడళ్లు 30 దాకా ఉన్నాయి. ఏసీ ఉష్ణోగ్రత ఏ సమయంలో ఎంత ఉండాలో నిర్దేశించవచ్చు. ఇన్‌బిల్ట్‌ ఎయిర్‌ ప్యూరిఫయర్‌తోపాటు బ్యాక్టీరియాను తొలగించే సాంకేతికత ఉంది. 45 అడుగుల వరకు గాలి వీస్తుంది.

Most from this category