టీసీఎస్ కన్నా మంచి ఫలితాలను ఇన్ఫీ సాధిస్తుందా?
By D Sayee Pramodh

మార్కెట్ అంచనాలను మిస్ చేస్తూ టీసీఎస్ ప్రథమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. రెవెన్యూ, మార్జిన్ల పరంగా టీసీఎస్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు అందరి దృష్టి శుక్రవారం ఫలితాలు ప్రకటించనున్న ఇన్ఫోసిస్‌పై నెలకొంది. టీసీఎస్ ఫలితాలను ఇన్ఫీ దాటగలదా? లేదా? అని అంతా ఆసక్తిగా ఉన్నారు. అయితే టీసీఎస్ తరహాలో ఇన్ఫీ సైతం ఎబిటా విషయంలో దెబ్బతినవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేతన వ్యయాలు పెరగడం, రూపీ బలపడడం, కొత్త పెట్టుబడులు.. ఎబిటాపై ఒత్తిడి పెంచవచ్చంటున్నారు. ఫలితాల్లో రెవెన్యూ గైడెన్స్, మార్జిన్స్, కొత్త డీల్స్, డిమాండ్ కామెంటరీ, బీఎఫ్‌ఎస్‌ఐపై కామెంటరీ, డిజిటల్ విభాగ పనితీరు తదితర అంశాలను నిశితంగా పరిశీలించాల్సిఉంటుందన్నారు. ఇటీవలే అంతర్జాతీయ దిగ్గజం గార్టనర్ సంస్థ ప్రపంచ ఐటీ వ్యయాల వృద్దిఅంచనాలను తగ్గించింది. ఈ నేపథ్యంలో దేశీ ఐటీ సంస్థల ఫలితాలపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు.
తాజా త్రైమాసికంలో ఇన్ఫీ రెవెన్యూ(స్థిర కరెన్సీ లెక్కల్లో) 2.6 శాతం వృద్ధి సాధిస్తుందని మార్కెట్ అంచనా వేస్తోంది. ఎబిటా మార్జిన్లు 110 బీపీఎస్ మేర క్షీణించవచ్చు. నికర లాభం 12 శాతం పతనం కావచ్చని అంచనా. నికర విక్రయాల్లో 14.2 శాతం పెరుగుదల ఉండొచ్చు. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫీ షేరు శుక్రవారం స్వల్పలాభంతో ట్రేడవుతోంది.
You may be interested
క్వెస్ కార్ప్ 18శాతం ర్యాలీ
Friday 12th July 2019అమెజాన్ కంపెనీకి 7.5లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలపడంతో క్వెస్ కార్ప్ షేర్లు శుక్రవారం 18శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌లో క్వెస్ కార్ప్ షేర్లు రూ.445.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రిఫరెన్షియల్ బేసిస్ పద్ధతిలో అమెజాన్ కంపెనీకి ప్రతి ఈక్విటీ షేరు రూ.676 చొప్పున మొత్తం 754,437 షేర్లును రూ.51 కోట్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు క్వెస్ కార్ప్ నేడు ఎక్చ్సేంజీలకు సమాచారం తెలిపింది. ఇష్యూలో
మెటల్ షేర్ల మెరుపులు
Friday 12th July 2019ట్రేడవార్ భయాలు తగ్గడంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంక్ వడ్డి రేట్లను తగ్గించనుందనే వార్తల నేపథ్యంలో దేశియ మెటల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.68 శాతం లాభపడి 2,852.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మెటల్ ఇండెక్స్‌లో జిందాల్ స్టీల్ 4.67 శాతం, టాటా స్టీల్ 3.07 శాతం, వేదాంత లి. 2.63 శాతం, సెయిల్ 2.46 శాతం, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్(ఎన్ఎమ్డీసీ)