News


ఫెడ్‌ రేట్‌కట్‌ ఎందుకింత భయపెట్టింది?

Thursday 1st August 2019
news_main1564649703.png-27475

భారీగా పతనమైన యూఎస్‌ మార్కెట్లు
అదేబాటలో ఆసియా మార్కెట్లు
అంతా ఊహించినట్లే యూఎస్‌ ఫెడరల్‌ బ్యాంకు బుధవారం సమావేశంలో వడ్డీరేట్లను 25 బీపీఎస్‌ మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ సందర్భంగా ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చేసిన కామెంట్లు ఒక్కసారిగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో యూఎస్‌ మార్కెట్‌ నిట్టనిలువునా పతనమైంది. సమీక్షా సమావేశం సందర్భంగా మాట్లాడుతూ సుదీర్ఘ రేట్‌ కట్‌ సైకిల్‌కు తాజా నిర్ణయం ఆరంభం కాదని పావెల్‌  చెప్పారు. అంటే ప్రస్తుత తగ్గింపు తర్వాత రేట్‌కట్స్‌ కొనసాగకపోవచ్చని పరోక్షంగా చెప్పారు. ఇది మార్కెట్లో సెంటిమెంట్‌పై నెగిటివ్‌ ప్రభావం చూపింది. దీంతో డౌజోన్స్‌, నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 సూచీలు దాదాపు ఒక్క శాతానికి పైన పతనమయ్యాయి. ఇందుకు కొనసాగింపుగా ఆసియా మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇదే బాటలో భారత సూచీలు సైతం భారీ నష్టాల్లో ఉన్నాయి. భవిష్యత్‌లో మరిన్ని రేట్‌కట్స్‌ ఉంటాయన్న భరోసా పావెల్‌ ఇ‍వ్వకపోవడాన్ని మార్కెట్‌ నెగిటివ్‌గా చూసిందని రాయిటర్స్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. తాజా తగ్గింపు రేటకట్‌ సైకిల్‌కు ఆరంభం కాదని, అయితే ఒక్కసారి మాత్రమే రేట్లు తగ్గిస్తామని కూడా తాను చెప్పనని పావెల్‌ వ్యాఖ్యానించారు. ఈ మాటలు పదేళ్ల తర్వాత తీసుకున్న రేట్‌కట్‌ నిర్ణయ సంబరాలను ఆవిరిచేశాయని నిపుణులు వివరించారు.

పావెల్‌ ఇదే చివరి రేట్‌కట్‌ అనలేదని, మార్కెట్లు అనవసరంగా నెగిటివ్‌ స్పందన చూపాయని వర్ధమాన మార్కెట్ల నిపుణుడు జెఫ్‌ డెన్నిస్‌ అభిప్రాయపడ్డారు. పావెల్‌ మాటలతో డాలర్‌ బలపడడం వర్ధమాన మార్కెట్లకు ఇబ్బందన్నారు. మార్కెట్‌కు కావల్సిన రీతిలో పావెల్‌ మాటలు లేవని, మరికొన్ని రేట్‌కట్స్‌ ఉన్నా.. పూర్తి ప్రణాళిక లేకపోవడం మార్కెట్‌కు రుచించలేదని మన్‌హట్టన్‌ వెంచర్స్‌ నిపుణుడు సంతోష్‌ రావు చెప్పారు. ఫెడ్‌ మరోమారు రేట్లను తగ్గించవచ్చని అంచనా వేశారు. పావెల్‌ తన మాటలకు వివరణ ఇస్తే మార్కెట్లో ఆందోళన సద్దుమణుగుతుందన్నారు. సాధారణంగా రేట్‌కట్‌ నిర్ణయానికి ఈక్విటీలు పాజిటివ్‌గా స్పందిస్తాయని కానీ ఈ సారి ఇందుకు భిన్నంగా జరుగుతోందని కామ్‌సెక్‌ ఎకనమిస్టు క్రెగ్‌జేమ్స్‌ చెప్పారు. భవిష్యత్‌లో రేట్ల తగ్గింపుపై పావెల్‌ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడమే తాజా పతనానికి కారణమని చెప్పారు. పావెల్‌ వ్యాఖ్యలపై తగిన వివరణ వస్తేనే ఈ ఆందోళన తగ్గుతుందన్నారు. You may be interested

ఎన్‌బీఎఫ్‌సీలకు సీనియర్‌ మేనేజర్లు బై

Thursday 1st August 2019

ఎన్‌బీఎఫ్‌సీ రంగం సంక్షోభంలో చిక్కుకోవడంతో ఈ రంగంలో పనిచేసిన సీనియర్‌ మేనేజర్లు బ్యాంకింగ్‌ లేదా ఫిన్‌టెక్‌ విభాగాలకు మారుతున్నారని విశ్లేషకులు తెలిపారు. ఒకనొకప్పుడు బ్యాంకింగ్‌ సెక్టార్‌ నుంచి ఎన్‌బీఎప్‌సీల వైపు స్విచ్‌ ఓవర్లు జరిగిన విషయం తెలిసిందే. మనీషా లాత్ గుప్తా (క్లిక్స్ క్యాపిటల్ నుంచి ఉబెర్‌కు), రమేష్ విశ్వనాథన్  (ఎల్ అండ్ టి ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌కు) స్విచ్‌ఓవర్‌ చేసిన వారిలో సుప్రసిద్ధులు.

మరో 5 శాతం పతనమైతే ఆర్‌ఐఎల్‌ కొనొచ్చు!

Thursday 1st August 2019

షేర్‌ఖాన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హేమాంగ్‌ జాని సూచన రెండు నెలలుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ప్రధాన సూచీల కన్నా మంచి ప్రదర్శన చూపిందని షేర్‌ఖాన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హేమాంగ్‌ జాని చెప్పారు. తాజాగా విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయన్నారు. కంపెనీ కొత్త వ్యాపారాలు అదరగొడుతున్నాయన్నారు. కంపెనీ కోర్‌ బిజినెస్‌ మాత్రం సవాళ్లను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. ఇందుకు మందగమనమే ప్రధాన కారణమన్నారు. పెట్‌కెమ్‌, రిఫైనింగ్‌ వ్యాపారాల్లో ఇప్పటికిప్పుడే వృద్ది రాకపోవచ్చన్నారు. ప్రస్తుతం

Most from this category