News


హార్లిక్స్‌, బూస్ట్‌లను ఎందుకు అమ్మేసినట్టు?

Wednesday 5th December 2018
news_main1543949770.png-22627

బ్రిటిష్‌ దిగ్గజం గ్లాక్సోస్మిత్‌క్లయిన్‌ (జీఎస్‌కే) భారత్‌లోని తన పోషకాహార వ్యాపారాన్ని హిందుస్తాన్‌ యూనిలీవర్‌లో విలీనం చేయడానికి ఒప్పందం చేసుకుంది. 140 సంవత్సరాల చరిత్ర ఉన్న హార్లిక్స్‌తోపాటు ఎక్కువ మార్కెట్‌ వాటా కలిగిన బూస్ట్‌ను, వివా, మాల్టోవా బ్రాండ్లను జీఎస్‌కే వదులుకోవడానికి కారణమేంటన్న ప్రశ్న ఇన్వెస్టర్లకు ఎదురుకావచ్చు. ఇందుకు విశ్లేషకులు చెబుతున్న కారణాలు ఇవీ...

 

జీఎస్‌కే కంపెనీ భారత్‌లోని తన కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ ఇండియాను విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్న రోజునే... అమెరికా కేంద్రంగా పనిచేసే కేన్సర్‌ పరిశోధన కంపెనీ తెసారోను 5.1 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. దీనివల్ల ఓవేరియన్‌ కేన్సర్‌ ఔషధం జెజులా జీఎస్‌కే చేతికి వచ్చింది. దీన్నిబట్టి జీఎస్‌కే తన ప్రధాన వ్యాపారమైన ఔషధ విభాగంపై ఎక్కువ ఫోకస్‌కు నిర్ణయించింది. 300 ఏళ్ల చరిత్ర ఉన్న జీఎస్‌కే కంపెనీకి సీఈవోగా ఎమ్మావామ్‌స్లే 2017లో వచ్చారు. అప్పటి నుంచి కంపెనీ దీర్ఘకాలంలో ప్రయోజనాలు చేకూర్చే వ్యాపారాలపైనే దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేయడం, మార్జిన్‌ ఎక్కువగా ఉన్న ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడం కంపెనీ ప్రాధాన్యతలుగా ఉన్నాయి. రెస్పిరేటరీ, హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌కు చెందిన రెండు ఔషధాలతోపాటు ఆంకాలజీ, ఇమ్యూనో ఇన్‌ఫ్లమ్మేషన్‌ థెరపీకి సంబంధించి మరో రెండు ఔషధాలకు 80 శాతం నిధులను కేటాయించాలని కంపెనీ నిర్ణయించింది. జీఎస్‌కే ఆదాయాల్లో 60 శాతం ఫార్మాస్యూటికల్‌ నుంచి వస్తుంటే, వ్యాక్సిన్లు, కన్జ్యూమర్‌ హెల్త్‌ నుంచి మిగిలిన 40 శాతం ఆదాయం సమకూరుతోంది. ‘‘హార్లిక్స్‌ ఈ విభాగంలో ఇమడలేదు. మాల్ట్‌ ఆధారిత హెల్త్‌ డ్రింక్‌ విభాగం వృద్ధి చెందడం లేదు. ఆవిష్కరణలకు కూడా అవకాశం లేదు’’ అని కంపెనీ వర్గాల సమాచారం. మాల్ట్‌ డ్రింక్‌ విభాగంలో గతంలో కంటే వృద్ధి తగ్గింది. తక్కువ పంచదార కలిగిన ఉత్పత్తుల వైపు వినియోగదారులు మళ్లుతుండడాన్ని కంపెనీ గుర్తించింది. ఇది గుర్తించే వామ్‌స్లే ఈ వ్యాపారాన్ని విక్రయించేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపాయి.

 

దేశంలో ఫార్మాస్యూటికల్స్‌, కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ పేరుతో జీఎస్‌కే రెండు కంపెనీలను నిర్వహిస్తోంది. ఔషధ విభాగం అంతా జీఎస్‌కే ఫార్మాస్యూటికల్స్‌ కిందే ఉంది. ఫార్మా కంపెనీ ఆదాయం రూ.2,895 కోట్లు. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 70 వరకు ఔషధాలు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియో క్రమబద్ధీకరణ, ధరల పెంపు, వ్యాక్సిన్ల వ్యాపారాన్ని పెంచుకోవడంపై కంపెనీ దృష్టి పెట్టింది. వృద్ధికి అవకాశాలున్న 20 బ్రాండ్లపై ఫోకస్‌ పెంచింది.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Wednesday 5th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 64 పాయింట్ల నష్టంతో 10,848 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,907 పాయింట్లతో పోలిస్తే 59 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక

ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పరిమితికి మించి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చా?

Wednesday 5th December 2018

పన్ను మినహాయింపులు కల్పించే ఈక్విటీ ఆధారిత సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మ్యూచువల్‌ ఫండ్స్‌ గురించి ఇన్వెస్టర్లకు తెలియంది కాదు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ నిబంధన కింద ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఆ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. బేసిక్‌ పన్ను మినహాయింపు రూ.2.5 లక్షలకు ఇది అదనం. అయితే, రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత ఇంకా

Most from this category