News


క్యు3లో మెరిసేదెవరు? నీరసించేదెవరు?

Tuesday 7th January 2020
news_main1578392883.png-30739

మూడో త్రైమాసికంలో వివిధ రంగాల ఫలితాలపై అంచనాలు ఇలా ఉన్నాయి...
1. ఐటీ: 
టాప్‌ ఐటీ కంపెనీలు డాలర్‌ రెవెన్యూలో 1.5- 3 శాతం వృద్ది నమోదు చేయవచ్చు. విప్రో, టెక్‌మహీంద్రాలు ఈ దఫా మెరుగైన ఫలితాలు చూపవచ్చు. కంపెనీల మేనేజ్‌మెంట్‌ కామెంటరీ కీలకం కానుంది. దీనికితోడు రెవెన్యూ గైడెన్స్‌లో మార్పులను పరిశీలించాలి. బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో పనితీరు ఆధారంగా కంపెనీల ఫలితాలు ఉంటాయని అంచనా.

2. ఆటో:

 

ఆటో రంగంలో డౌన్‌ట్రెండ్‌ బాటమ్‌ అవుట్‌ అయినట్లు కనిపిస్తోంది. వాల్యూంగ్రోత్‌ కూడా బాటమ్‌అవుట్‌ అవుతోంది. కానీ ద్విచక్ర, వాణిజ్య వాహన విభాగాల్లో ఒత్తిళ్లు కొనసాగుతాయి. పండుగ సీజన్‌లో ఇచ్చిన భారీ డిస్కౌంట్లు, భారీ ప్రమోషన్‌ కార్యక్రమాలు రెవెన్యూపై ప్రభావం చూపవచ్చు. అయితే కార్పొరేట్‌ పన్ను కోతతో లాభాల్లో మెరుగుదల ఉంటుంది.
3. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌:

ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకులు మంచి లాభాల వృద్ధి చూపవచ్చు. ఎస్‌బీఐ మరిన్ని స్లిపేజ్‌లు నమోదు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌లు మంచి లాభాలు చూపుతాయని అంచనా. పీఎస్‌యూ బ్యాంకుల ఫలితాలు పరిశీలించాలి.
4. క్యాపిటల్‌ గూడ్స్‌:

ప్రభుత్వ వ్యయాలు తగ్గడంతో కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం కొత్త ప్రాజెక్టులు ఆరంభించడంతో కొన్ని కంపెనీలు పేలవంగా, కొన్ని కంపెనీలు జోరుగా ఫలితాలు చూపవచ్చు. ఎల్‌అండ్‌టీ కామెంటరీ, గ్రోత్‌ గైడెన్స్‌లను నిశితంగా చూడాలి.
5. సిమెంట్‌:

సిమెంట్‌ బస్తా ధరలు పెరగడంతో కంపెనీలు రికార్డు రెవెన్యూ వృద్ధి సాధించవచ్చు. పెట్‌కోక్‌ ధరలు దిగిరావడంతో కంపెనీల ఎర్నింగ్స్‌ గ్రోత్‌ 85-96 శాతం పెరగవచ్చు. బడా కంపెనీల ఫలితాలు మరింత బాగుంటాయని అంచనా.
6. ఎఫ్‌ఎంసీజీ:

అల్ప విక్రయ వాల్యూంల కారణంగా రెవెన్యూ మందగించినా, కార్పొరేట్‌ టాక్స్‌ కటింగ్‌తో లాభాలు బాగుంటాయి. రూరల్‌ డిమాండ్‌లో క్షీణత కారణంగా పండుగ డిమాండ్‌ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. 
7. ఫార్మా:

యూఎస్‌ జనరిక్‌ మార్కెట్లో ప్రైసింగ్‌ ఒత్తిడులు, యూఎస్‌ఎఫ్‌డీఏ నిబంధనలు, దేశీయ మార్కెట్లో ధరల నియంత్రణా ఇబ్బందులు.. కంపెనీలపై నెగిటివ్‌ ప్రభావం చూపవచ్చు. వ్యయనియంత్రణలు, ఆర్‌అండ్‌డీ వ్యయాల తగ్గింపు, అల్పమార్జిన్‌ఉత్పత్తుల నుంచి వైదొలగడం లాంటివి మార్జిన్‌ వృద్ధికి దోహదపడతాయని అంచనా.
8. మెటల్స్‌:

క్యు3లో మెటల్‌ కంపెనీలు బలమైన ఫలితాలు ప్రకటించవచ్చు. దేశీయ స్టీల్‌ ధరలు పెరగడం, ముడిపదార్ధాల ధరలు దిగిరావడం కలిసివస్తాయి. స్టీల్‌తో పాటు అల్యూమినియం కంపెనీలు కూడా పాజిటివ్‌గా ఉండవచ్చు. జింక్‌ మాత్రం స్తబ్దుగా ఉంటుందని అంచనా.


Q3

You may be interested

వినియోగం తగ్గలే..! రూటు మార్చుకున్నదంతే..!

Tuesday 7th January 2020

దేశంలో వినియోగం రూటు మార్చుకున్నందటున్నారు టెక్నోపార్క్‌ సీఎండీ అరవింద్‌ సింఘాల్‌. దీనికి నిదర్శంగా విద్య, శిక్షణ, ఆరోగ్య సంరక్షణ, వినోదం, విహారంపై గత మూడు త్రైమాసికాల్లో వినియోదారులు చేస్తున్న ఖర్చు బలంగా ఉందన్నారు. ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడిన సందర్భంగా సింఘాల్‌ దేశంలో వినియోగంపై తన విశ్లేషణాత్మక అభిప్రాయాలను తెలియజేశారు.   వినియోగం తగ్గలేదు.. ‘‘వినియోగదారుల వ్యయాలు సేవల వైపు మళ్లుతున్నట్టు దీర్ఘకాలిక ధోరణి తెలియజేస్తోంది. దీంతో సరుకులపై చేసే వ్యయాలపై ఈ

ఆగని పెట్రోరంగ షేర్ల పతనం

Tuesday 7th January 2020

పెట్రో రంగ కంపెనీల షేర్ల వరుసగా పతనం మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లోనూ కొనసాగింది. ఈ రంగానికి చెందిన బీపీఎసీల్, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్లు 2శాతం వరకు నష్టపోయాయి. ప్రపంచదేశాలకు ఎక్కువగా ముడిచమురును ఎగుమతి చేసే మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు గరిష్టస్థాయిల వద్దే ట్రేడ్‌ అవుతున్నాయి. పెరిగిన ముడిచమురు ధరల కారణంగా మార్జిన్లు క్షీణించవచ్చనే భయాందోళనలు దేశీయ ఆయిల్‌ కంపెనీలను వెంటాడాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో

Most from this category