News


కొత్త ఫైనాన్స్‌ సెక్రటరీగా రాజీవ్‌ కుమార్‌

Wednesday 31st July 2019
news_main1564555532.png-27439

న్యూఢిల్లీ: ఆర్థిక సేవల కార్యదర్శిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్‌ కుమార్‌ మంగళవారం కొత్త ఫైనాన్స్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని నియామక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (ఏసీసీ) ఈ నియామకానికి ఆమోదముద్ర వేసినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. కుమార్‌ 1984 జార్ఖండ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. కుమార్‌కు బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలు, మూలధన కల్పన వంటి అంశాల్లో అపార అనుభవం ఉంది.  సుభాష్‌ చంద్ర గార్గ్‌ను ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి బాధ్యతల నుంచి విద్యుత్‌ శాఖ కార్యదర్శి బాధ్యతలకు బదలాయించిన నేపథ్యంలోనే తాజా నియామకమూ జరగడం గమనార్హం. 



You may be interested

హీరో మోటార్స్ లాభం 36 శాతం అప్‌

Wednesday 31st July 2019

క్యూ1లో రూ. 1,257 కోట్లు న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,257 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ. 925 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించింది. జాతీయ విపత్తు సహాయక నిధి కోసం గతంలో కేటాయించిన రూ. 737 కోట్లు రీఫండ్ కావడం.. తాజాగా లాభాల

ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ డైరెక్టర్‌గా చక్రవర్తి

Wednesday 31st July 2019

ముంబై: ఆర్థిక వ్యవహారాల ‍కార్యదర్శి అతాను చక్రవర్తి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  సెంట్రల్‌ బోర్డ్‌ డైరెక్టర్‌గా నామినేట్‌ అయ్యారు. ఆర్‌బీఐ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 29 నుంచీ అమల్లోకి వచ్చే ఈ నియామకం తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ అమల్లో ఉంటుంది.  సుభాష్‌ చంద్ర గార్గ్‌ స్థానంలో ఈ నియామకం జరిగింది. గార్గ్‌ ఈ నెల 25న ఆర్థిక

Most from this category