STOCKS

News


ఇన్ఫోసిస్‌పై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయ్‌?...

Tuesday 22nd October 2019
news_main1571721722.png-29046

విజిల్‌బ్లోయర్స్‌ పేరిట కొందరు ఉద్యోగులు ఇన్ఫీమేనేజ్‌మెంట్‌పై చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో మంగళవారం షేరు దాదాపు 15 శాతం వరకు పతనమైంది. ఈ ఆరోపణలపై కంపెనీ స్పందిస్తూ వీటిని కంపెనీ ఆడిట్‌ కమిటీ ముందుంచామని తెలిపింది. కమిటీకి డీ సుందరమ్‌ అధ్యక్షత వహిస్తుండగా, రూపా కుద్వా, పునీత్‌కుమార్‌ సిన్హాలు స్వతంత్ర సభ్యులుగా ఉన్నారు.

ప్రస్తుత సంక్షోభ నేపథ్యంలో ఇన్ఫీ షేరుపై ప్రముఖ బ్రోకరేజ్‌ల స్పందన ఇలా ఉంది...
1. జెఫర్రీస్‌: మరింత స్పష్టత వచ్చేవరకు ఈ విషయం రగులుతూనే ఉంటుంది. ఆరోపణలు నిజమైతే పీఈ డీరేటింగ్‌ ఛాన్సుంది. ఇది కంపెనీకి అతిపెద్ద రిస్కు. కంపెనీ వృద్ధి అంచనాల ఆధారంగా ఇటీవలే రీరేటింగ్‌ జరిగింది. ఈ సమయంలో ఆరోపణలు నిజమైతే చాలా పెద్ద ఇబ్బంది ఎదురుకానుంది. ఆరోపణలు చేసిన వాళ్లు సమర్పించే ఆధారాలు, కంపెనీ మేనేజ్‌మెంట్‌ ప్రతిస్పందన.. ప్రస్తుతం చాలా కీలకం. తాజా ఆరోపణలు కంపెనీ మేనేజ్‌మెంట్‌ విశ్వసనీయతపై అనుమానాలు పెంచాయి. 
2. రిలయన్స్‌ సెక్యూరిటీస్‌: ఇది చాలా సీరియస్‌ అంశం. ఇది కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్యకు సమానమైన విషయం. ఇప్పటికే డిప్యూటీ సీఎఫ్‌ఓ వైదొలిగారు. ఇది పాక్షికంగా ఆరోపణలు అంగీకరించినట్లే. స్టాకు స్వల్పకాలానికి 10- 15 శాతం పతనం కావచ్చు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు నమూనాగా పేర్కొనే కంపెనీలో ఇలాంటి విషయాలు బయటపడడం బాధాకరం. బోర్డు దర్యాప్తు నివేదిక కోసం వేచిచూడాలి. ఈ సమయంలో అందరూ కాకున్నా, కొందరు ఇన్వెస్టర్లైనా అమ్మకాలకు తెగబడవచ్చు. మార్కెట్లు ఇలాంటి అంశాలు వచ్చిన కంపెనీలను నిర్ధాక్ష్యిణ్యంగా శిక్షిస్తాయి. అయితే ప్రస్తుతానికి పూర్తి వివరాలు తెలియనందున కొంత కాలం వేచిచూడడం ఉత్తమం.

దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, కొత్తగా పోర్టుఫోలియోలోకి చేర్చుకోవాలనుకునేవాళ్లు వేచిచూడాలని నిపుణుల సలహా.You may be interested

10శాతం పెరిగిన యస్‌బ్యాంక్‌

Tuesday 22nd October 2019

ప్రైవేట్‌రంగానికి చెందిన యస్‌బ్యాంక్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 7శాతం లాభపడ్డాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.53.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్ సుమెర్ గ్రూప్‌నకు 6.4 ఎకరాల భూమిలో 50శాతం వాటాను బ్యాంకు టేకోవర్‌ చేయనునంది. దాని జాయింట్ వెంచర్ కంపెనీ రేడియస్ డెవలపర్స్ రూ .478 కోట్లకు పైగా బకాయిలు చెల్లించనందుకు యస్‌బ్యాంక్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తల నేపథ్యంలో

24 పైసలు బలపడిన రూపీ

Tuesday 22nd October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం సెషన్లో 24 పైసలు బలపడి 70.90 వద్ద ప్రారంభమైంది. కాగా అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు పడిపోవడంతో శుక్రవారం సెషన్‌లో రూపీ-డాలర్‌ మారకంలో స్వల్పంగా బలపడి 71.14  వద్ద ముగిసింది. తక్షణ డాలర్‌-రూపీ జంటకు 70.70-70.50 పరిధిలో మద్ధతు లభించే అవకాశం ఉందని, 72 స్థాయి వద్ద నిరోధం ఎదురుకానుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌ తెలిపింది. ‘ అక్టోబర్‌ ఆప్సన్‌ పంపిణీ ప్రకారం రూపీకి

Most from this category