News


‘‘వాట్సాప్‌ పే’’కు లైన్‌క్లియర్‌

Friday 7th February 2020
news_main1581069238.png-31602


ప్రపంచమంతా డిజిటల్‌ టెక్నాలజితో పరుగులు పెడుతోంది. దీంతో ఏ పనైనా సెకన్లు లేదా నిమిషాల్లో అయిపోతుంది.  ముఖ్యంగా ఏదైనా పేమెంట్‌ చేయాలంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది గూగుల్‌ పే, ఫోన్‌ పేలు. ఇప్పుడు వీటి సరసన ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌ చేరనుంది. గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ‘వాట్సాప్‌ పే’ సేవలు ఇండియాలో అందించడానికి లైన్‌క్లియర్‌ అయింది. ద నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) ‘వాట్సాప్‌  పే’ సేవలను ఇండియాలో ప్రారంభించేందుకు లైసెన్స్‌ను జారీ చేసినట్లు ఆర్బీఐ ఎక్సిక్యూటివ్‌ ఒకరు వెల్లడించారు. ఫేస్‌బుక్‌ లోకల్‌ డేటా రెగ్యూలేషన్‌ నిబంధనలకు అనుగుణంగా ఎన్‌పీసీఐ అనుమతి పొందిందని అధికారి వివరించారు. 10 మిలియన్ల మంది వినియోగదారులు కలిగిన వాట్సాప్‌ మెసెంజర్‌ తాజా ‘వాట్సాప్‌ పే’తో దేశంలోనే అతిపెద్ద యూపీఐ పేమెంట్స్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా నిలవనుంది. ఇండియాలో 400 మిలియన్ల వాట్సాప్‌యాక్టివ్‌ యూజర్లు ఉండడం ‘వాట్సాప్‌ పే’కు మరింత అనుకూలంగా మారనుంది. 2018లోనే వాట్సాప్‌ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి ఎంపిక చేసిన యూజర్లతో ‘వాట్సాప్‌ పే’ ట్రైల్‌ రన్‌ను నిర్వహించింది. కాగా ఇప్పటికే ఈ రంగంలో సేవలు అందిస్తున్న గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం వంటి సంస్థలకు ‘వాట్సాప్‌ పే’గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.You may be interested

ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Friday 7th February 2020

ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ వరుసగా మూడోరోజూ లాభంతో ముగిసింది. మార్కెట్‌ నష్టాల్లో ముగిసినప్పటికీ ఫార్మా రంగ షేర్లు లాభపడటం విశేషం. ఈ రంగంలో ప్రధాన షేర్లైన అరబిందో ఫార్మా, 6.50శాతం లాభపడింది. బయోకాన్‌ 5.50శాతం, దివీస్‌ ల్యాబ్స్‌ 3.30శాతం, గ్లెన్‌మార్క్‌ షేరు 2.50శాతం, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేరు 1.50శాతం, కేడిల్లా హెల్త్‌కేర్‌ 1శాతం, సిప్లా అరశాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు

షేర్ల ఎంపికకు నాలుగు రంగాలు!

Friday 7th February 2020

పంకజ్‌ టిబ్రేవాల్‌ షేర్లలో బాటమ్‌అప్‌ ఎంపిక అవకాశాలు వెతికి అందిపుచ్చుకోవాలని కోటక్‌ ఎంఎఫ్‌ ఈక్విటీ మేనేజర్‌ పంకజ్‌ టిబ్రేవాల్‌ సూచిస్తున్నారు. బాటమ్‌ అప్‌ షేర్లను నాలుగు రంగాల్లో గుర్తించవచ్చంటున్నారు. మూడునాలుగేళ్లుగా స్పెషాలిటీ కెమికల్స్‌ రంగం మంచి పాజిటివ్‌గా ఉందన్నారు. అదేవిధంగా సప్లైచైన్స్‌ భారత్‌దిశగా మరలుతున్నాయని, ఇలాంటి సప్లైచైన్స్‌తో సంబంధం ఉన్న కంపెనీలు రాబోయే కాలంలో దూసుకుపోతాయని చెప్పారు. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలని చెప్పారు. ఇక మూడో పాజిటివ్‌ రంగం క్యాపిటల్‌గూడ్స్‌ అని

Most from this category